Breaking News

30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ముప్కాల్‌ మండల కేంద్రంలో, బాల్కొండ మండలం కిసాన్‌ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఎక్కడ కూడా చెత్త లేకుండా చూడాలన్నారు. అదే విధంగా శుభ్రం చేయాలని చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా అపరి శుభ్రత లేకుండా చూడాలన్నారు.

లక్ష్యానికి అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని, గుంతల్లో నీరు నిలువకుండా గుంతలను పూడ్చాలని, వీధిలైట్లు పగటి సమయంలో కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *