Breaking News

కాలేశ్వరం నీరు రాకతో కల నెరవేరింది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం నీరు పోచంపాడు వరద గేట్లను తాకడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాల్కొండ మండలం ముప్కాల్‌ వద్దగల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల వరకు కాలేశ్వరం నీరు చేరుకున్నందున అక్కడ ఆయన గోదావరి మాతకు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేశ్వరం నీరు శ్రీరాంసాగర్‌కు వస్తుందో అని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామన్నారు. నీరు ఇప్పుడు శ్రీరాంసాగర్‌ గడపను ముద్దాడిందని తన కల నెరవేరిందన్నారు. రెండు వందల కిలోమీటర్లు ఎదురొచ్చి ఈ నీటిని శ్రీరాంసాగర్‌లో నింపుకోవడానికి అవకాశం ఏర్పడిందని మంత్రి తెలిపారు. కాలేశ్వరం సష్టికి కషిచేసిన ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

మూడు సంవత్సరాల క్రితం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆలోచన చేసినప్పుడు ఎవరు కూడా నమ్మలేదని ఫలాలు ఇప్పుడు మెల్లగా కళ్లకు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రాజెక్టు రీడిజైన్‌కు ముఖ్యమంత్రి రేయింబవళ్లు పని చేయడం తాను కళ్ళారా చూశానన్నారు. ఎన్ని కోట్లు అయినా తెలంగాణ రైతాంగానికి ఎట్టి పరిస్థితిలోనూ సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

200 కిలోమీటర్ల దూరం ఉన్న కాలేశ్వరం నీటిని లక్ష్మీపూర్‌, రాంపూర్‌, మిడ్‌ మానేరు వరకు నీరు వచ్చిందని పంపు పనులు కూడా నడుస్తున్నాయని, త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. సాగునీరు అందించి రైతును బ్రతికించుకోవాలనే ఆర్తితో పనులు నిర్వహిస్తున్నామన్నారు. 90 శాతం రైతాంగం వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతుకుతున్నారని వారు బాగుపడడానికే ఈ తపన అని తెలిపారు. తాగునీరు ప్రాజెక్టులకు 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా రైతులు బాగు పడుతుంటే వేరే ఆలోచన అవసరం లేదని ముఖ్యమంత్రి భావన అన్నారు.

కాలేశ్వరం ద్వారా నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల కోసం నీరందించనున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవం ద్వారా కాళేశ్వరం నుండి 60 టిఎంసిలు నీరు నింపుకుంటూ మరో 30 టీఎంసీలు ప్రాజెక్టులోని కలుపుకొని పుష్కలంగా పంటపొలాలకు నీటిని అందిస్తామన్నారు. దీని ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని లక్ష 30 వేల ఎకరాలకు నీరు అందించనున్నామన్నారు.

ప్యాకేజీ 21 ద్వారా కమ్మర్‌పల్లి, వేల్పూర్‌, మోర్తాడ్‌, భీమ్‌గల్‌ మండలాల్లోని సాగునీటి సౌకర్యంలేని గ్రామాలకు నీటిని అందించడానికి 2,750 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని, ఒకటిన్నర సంవత్సరాల్లో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

కామారెడ్డి మునిసిపాలిటీ తెరాస కైవసం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మునిసిపల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *