Breaking News

Daily Archives: September 11, 2019

దళితులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గ విస్తరణలో దళితులకు చోటు కల్పించకపోవడం బాధాకరమని ఎంఆర్‌పిఎస్‌ మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు. మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు భూమయ్య, పోశెట్టి, అబ్బయ్య, గంగాధర్‌, కిరణ్‌, నరేశ్‌, వినోద్‌ ఉన్నారు.

Read More »

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ టేక్రియాల్‌ చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డిఓ రాజేంద్ర కుమార్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, పోలీస్‌ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Read More »

మండలంలో ఘనంగా వినాయక నిమజ్జనం

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, బోర్గాం, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న స్వామివారు అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలివెళ్లిపోయారు. కందకుర్తి గ్రామంలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గోదావరి కళాబృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రధానవీదుల గుండా శోభాయాత్ర సాగింది. అనంతరం గ్రామ పరిసరాల్లోని గోదావరిలో నిమజ్జనం చేశారు. స్థానిక సర్పంచ్‌ కలీంబేగ్‌ ఏర్పాటు చేసిన కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ...

Read More »

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు విద్యార్థుల ఎంపిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్తాయి హ్యాండ్‌బాల్‌ క్రీడలకు రెంజల్‌ మండల పాఠశాలకు చెందిన విద్యార్థులు శృతి, శ్రీలత, అనిల్‌లు ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరామ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌లు తెలిపారు. ఈనెల జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్‌బాల్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రస్తాయికి ఎంపికైన విద్యార్థులను మాడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్‌ కాంబ్లే, జైనుద్దీన్‌, అయేషా సుల్తానాలు ఉన్నారు.

Read More »

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో కెసిఆర్‌ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమయ్యాక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ...

Read More »

నిర్దేశించుకున్న లక్ష్యాల పూర్తికి 30 రోజుల ప్రణాళిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో ప్రగతిని సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో కామారెడ్డి డివిజన్‌కు జిల్లా పరిషత్‌ సీఈవో కాంతమ్మ , ఎల్లారెడ్డి డివిజన్‌కు డిపీఓ నరేష్‌, బాన్సువాడ డివిజన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తారని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డులలో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు ఈ నెల ...

Read More »

డిసిసి ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ నాయీమ్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ నయీమ్‌ పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి అనేక రకాలుగా సేవలందిస్తు, పార్టీని బలపరుస్తూ చైతన్య పరిచారు. ప్రజలకు ఉపయోగపడి ప్రయోజనాలను ప్రతి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందే విధంగా అనేక సేవలు అందించారు. తెరాస ప్రభుత్వంలో సామాజిక దక్పథంతో సేవలు అందించినా పార్టీ గుర్తించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌ ...

Read More »

డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లో డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో గల పూల కుండీలను పరిశీలించి వాటిలో నీరు నిల్వ ఉంటే తొలగించారు. డ్రైనేజీలో దోమలు నివారణకు సంబంధించిన మందును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోనూ, ఇళ్లలోనూ, ఇంటి పరిసరాలలోను పూల కుండీలు, పాత డబ్బాలు, పాత బకెట్లు, కొబ్బరి ...

Read More »

మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ అరెస్ట్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నారాయణఖేడ్‌లో రైతు రుణమాఫీ, యూరియా కొరత, రైతు బంధు విడుదల కొరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. తొందరగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరాయస్వామి, మాజీ జడ్పీటిసి నిరంజన్‌, మాజీ ఎంపీపీ రామారావు, నాగల్గిద్ద మండల్‌ అధ్యక్షుడు, మణిక్‌ రావు ...

Read More »

పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిజాంపేట్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. శాసన సభ్యులు యం.భూపాల్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోగల కందకాలలో నీరు నిలువ ఉండడంతో సర్పంచ్‌ జగదీశ్వర్‌ చారి తయారు చేయించిన బాబుల్స్‌ నీటి గుంతలలో దోమల లార్వా చనిపోవడానికి వేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి, రోగుల ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ...

Read More »

గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోనూ, దర్పల్లి మండలం కేంద్రంలోను, ఇందల్వాయి మండలం తిర్మన్‌ పల్లి గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వీధులలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. దుబ్బాక గ్రామంలో జిల్లా ...

Read More »