Breaking News

నిర్దేశించుకున్న లక్ష్యాల పూర్తికి 30 రోజుల ప్రణాళిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో ప్రగతిని సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో కామారెడ్డి డివిజన్‌కు జిల్లా పరిషత్‌ సీఈవో కాంతమ్మ , ఎల్లారెడ్డి డివిజన్‌కు డిపీఓ నరేష్‌, బాన్సువాడ డివిజన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తారని తెలిపారు.

అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డులలో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌ స్థల సేకరణ ప్రతిపాదనలు ఈ నెల 12వ తేదీలోగా సంబంధిత అధికారులకు పంపాలని తెలిపారు. స్థల సేకరణ చేసిన వైకుంఠధామం, డంప్‌ యార్డులు పనులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్‌ వార్డులలో 15లోగా, మండల స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో పద్ధతిలో 18వ తేదీలోగా గ్రీన్‌ ప్లాన్‌ ప్రిపరేషన్‌ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 109 గ్రామ పంచాయతీలలో 317 ఎకరాల మంకీ ఫుడ్‌ కోర్ట్‌ సంబంధించి అవసరమున్న చోట 12 తేదీలోగా ఎర్రమన్ను నింపాలని, 15వ తేదీలోగా గుంతలు తీసి 17వ తేదీలోగా మొక్కలు నాటడం పూర్తి చేసుకొని, బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీలోగా గ్రామపంచాయతీ వార్షిక ప్లాను, ఐదు సంవత్సరాల వార్షిక ముసాయిదాను తయారు చేసుకోవాలని, 30వ తేదీలోగా తుది యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని, వచ్చే అక్టోబర్‌ 5వ తేదీన నిర్వహించే గ్రామ సభలో యాక్షన్‌ ప్లాన్లను తీర్మానం ద్వారా ఆమోదింప చేసుకోవాలని తెలిపారు.

కార్యక్రమాలకు సంబంధించిన బిఫోర్‌, ఆఫ్టర్‌గా తీసిన ఫోటోగ్రాఫ్‌లను ఈ నెల 14, 21, 28, అక్టోబరు 5 తేదీలలో పంపాలని తెలిపారు. పనిచేయని, నిరుపయోగంగా ఉన్న బోర్‌వెల్స్‌ను, బావులను పూడ్చివేసేందుకు 12వ తేదీలోగా గ్రామ పంచాయతీ ద్వారా సర్టిఫికేషన్‌ పొందాలని సూచించారు. గోడలమీద 5 స్లోగన్స్‌ ఈనెల 14వ తేదీలోగా రాయించాలని తెలిపారు. ఒక మీటరు పైగా ఉన్న మొక్కలను ఈ నెల 20వ తేదీలోగా రోడ్లకు ఇరువైపులా నాటి బ్రష్‌ వుడ్‌, ఫెన్సింగ్‌ ఏర్పాటు తప్పనిసరి చేయాలని తెలిపారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నిర్వహించిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిన్నటివరకు నిర్వహించిన కార్యాచరణ పనుల గురించి వివరించారు. 1,33,894 పెంట కుప్పలను తొలగించడం జరిగిందని, 99,075 మీటర్ల మేర జిల్లేడు, వయ్యారిభామ, కంపచెట్లను, 1,20,683 మీటర్ల మేర గుబురు పొదలు, పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందని, 5055 కిలోమీటర్ల మేర డ్రైన్స్‌లో పూడికతీయడం జరిగిందని తెలిపారు.

613 శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 992 రోడ్లపై గుంతలు పూడ్చడం జరిగిందని, 63 శిథిలాలు తొలగించడం జరిగిందని తెలిపారు. అంగన్‌వాడి, పాఠశాలలో 682 పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ సంబంధించి 55,658 మొక్కలు, రైతులకు 36,991 మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని, ఆరు మీటర్లు కన్నా ఎత్తు గల 31,157 మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *