Breaking News

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు విద్యార్థుల ఎంపిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్తాయి హ్యాండ్‌బాల్‌ క్రీడలకు రెంజల్‌ మండల పాఠశాలకు చెందిన విద్యార్థులు శృతి, శ్రీలత, అనిల్‌లు ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరామ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌లు తెలిపారు.

ఈనెల జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్‌బాల్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రస్తాయికి ఎంపికైన విద్యార్థులను మాడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్‌ కాంబ్లే, జైనుద్దీన్‌, అయేషా సుల్తానాలు ఉన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *