Breaking News

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో కెసిఆర్‌ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమయ్యాక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి అయ్యాక విస్మరించారని తీవ్రంగా మండిపడ్డారు.

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకత్యాలు మరచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందన్నారు. రజాకార్లు తెలంగాణ మహిళలు, ప్రజానీకంపై చేసిన అకత్యాలు తెలంగాణ సమాజం మరువదని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కాపాడే విధంగా ప్రభుత్వం సెప్టెంబర్‌ 17 ను అధికారికంగా నిర్వహించాలని లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలు, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున జెండా ఆవిష్కరణ, మానవ హారాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *