Breaking News

మండలంలో ఘనంగా వినాయక నిమజ్జనం


రెంజల్‌, సెప్టెంబర్‌ 11
నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, బోర్గాం, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న స్వామివారు అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలివెళ్లిపోయారు. కందకుర్తి గ్రామంలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గోదావరి కళాబృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రధానవీదుల గుండా శోభాయాత్ర సాగింది.
అనంతరం గ్రామ పరిసరాల్లోని గోదావరిలో నిమజ్జనం చేశారు. స్థానిక సర్పంచ్‌ కలీంబేగ్‌ ఏర్పాటు చేసిన కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ యువతీ, యువకుల కోలాహలం నడుమ గణేశ్‌ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెంజల్‌ ఎస్‌ఐ శంకర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *