Breaking News

Daily Archives: September 12, 2019

స్వచ్చంద సేవా సమితి ఆర్థిక సాయం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బత్తిని సంగీత అనే మహిళ గర్భిణిగా ఉండగా అంతు చిక్కని వ్యాధి సోకి వైద్య పరీక్షల కోసం చాలా ఖర్చు అయింది. సంగీత ఇటీవల ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో, విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకుడు వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి తనవంతు సహాయంగా రూ. 5 వేలు ఆర్థిక సహాయం చేశారు. గురువారం కాంగ్రెస్‌ నాయకులు వారి ఇంటికి ...

Read More »

చెరువుల వద్దకు వెళ్లకూడదు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి చెరువు వద్ద ఎస్‌ఐ సాయన్న హెచ్చరిక ఫ్లెెక్సీ ఏర్పాటు చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు పడడంతో చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని, ప్రమాదకరంగా ఉండడంతో చెరువులు, కుంటల వద్దకు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Read More »

ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిస్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజు వారి కార్యక్రమాలను నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ చందూరు, వర్ని మండలంలోని ఘనపూర్‌ వకిల్‌ ఫారం గ్రామాలలో జరుగుతున్న గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామ ...

Read More »

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎన్‌పిడిసిఎల్‌ నిజామాబాద్‌ ఎస్‌.ఇ. సుదర్శనం టౌన్‌ సబ్‌ డివిజన్‌ స్టాఫ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా టౌన్‌లో గల అన్ని రకాల విద్యుత్‌ సమస్యలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లూస్‌ లైన్స్‌, రోడ్‌ క్రాసింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెల ఎత్తును పెంచడం, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర కంచెలు ఏర్పాటుచేయటం, విరిగిన స్థంబాలను తొలగించడం, జంతువులకు, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా అన్నిరకాల ...

Read More »

గణేష్‌ నిమజ్జనంలో అపశతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన గణేష్‌ నిమజ్జనంలో అపశతి చోటు చేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మంటపాలలో భాగంగా రజక సంఘం ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా శేఖర్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కిందపడి మతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More »

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్‌ కమీషనర్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ కేంద్రంలో గురువారం జరిగే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమలను, శోభయాత్ర జరిగే ప్రధాన ప్రదేశాలు, నిమజ్జనం చేసే ప్రదేశాన్ని బుధవారం సాయంత్రం పోలీసు కమీషనర్‌ కార్తికేయ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆనంద సంతోషాలతో శోభాయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చె వదంతులను నమ్మరాదని అన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటాయని ప్రజలందరూ ...

Read More »