Breaking News

ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిస్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజు వారి కార్యక్రమాలను నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ చందూరు, వర్ని మండలంలోని ఘనపూర్‌ వకిల్‌ ఫారం గ్రామాలలో జరుగుతున్న గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలు చెత్తను నిర్దిష్టమైన ప్రదేశంలో వేసేందుకు వారికి అవగాహన కల్పించాలని, వినని పక్షంలో జరిమానా వేయాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నుకున్న వార్డు సభ్యులు కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అందరు కలిసి వీధి సమస్యలను గుర్తించాలని, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేందుకు కషిచేయాలని చెప్పారు.

మురుగు కాలువలో నీరు నిలువకుండా అదేవిధంగా రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళికలో రోజువారి కార్యక్రమాలను అదే రోజు పూర్తి చేయాలంటే అంతకంటే ముందు నుండి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఆయా గ్రామాలలో సభ్యులు గుర్తించిన సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పల్లెలు పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పల్లెలో మంచి వాతావరణం ఉన్నట్లయితే ప్రజలకు ఏలాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య వంతంగా ఉంటారని, ఒక్కొక్క ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటాలని కోరారు. రోడ్డుకిరువైపులా (అవెన్యూ) మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని, సరిపోను మొక్కలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ముందుగా జిల్లా కలెక్టర్‌ చందూరు మండల కేంద్రంలో పర్యటించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. గ్రామాన్ని పరిశుభ్రం చేసి ఫోటోలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల వద్ద గ్రామపంచాయతీ ప్రభుత్వ భవనాల వద్ద అపరిశుభ్రంగా ఉండకూడదని, గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డ్‌లో వేయాలని, వైకుంఠ దామం అభివద్ధి చేసుకోవాలని సూచించారు.

వంగిన శిథిలావస్థలో ఉన్న కరెంట్‌ స్తంభాల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వర్ని మండలం గణపురం వకిల్‌ ఫారం గ్రామాలను తనిఖీ చేసి మండలం గ్రామ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ వెంట వర్ని స్పెషల్‌ అధికారి, ఉప కమిషనర్‌ లేబర్‌ చతుర్వేది, గణపురం గ్రామ స్పెషల్‌ అధికారి, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *