Breaking News

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్‌ కమీషనర్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ కేంద్రంలో గురువారం జరిగే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమలను, శోభయాత్ర జరిగే ప్రధాన ప్రదేశాలు, నిమజ్జనం చేసే ప్రదేశాన్ని బుధవారం సాయంత్రం పోలీసు కమీషనర్‌ కార్తికేయ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆనంద సంతోషాలతో శోభాయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చె వదంతులను నమ్మరాదని అన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటాయని ప్రజలందరూ సహకరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి గణేష్‌ వాహనాలు నడిపితే వారిపై ఆల్క మీటర్‌ పరీక్షలు జరుగుతాయని సూచిస్తూ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే, చట్టవ్యతిరేకమైన కార్యకలపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళలు విలువైన వస్తువులు ధరించకూడదని సూచించారు. చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో చిన్నపిల్లల అనుమతించబడదని పేర్కొన్నారు. ప్రజలు, మండప నిర్వాహకులు సకాలంలో నిమజ్జన శోభాయత్ర చేపట్టాలన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారని, స్థానిక మున్సిపల్‌, రెవిన్యూ తదితర అధికారులకు పోలీసులకు ప్రజలు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.

అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏసిపి అందే రాములు, ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్‌తో పాటు ఆర్మూర్‌ రూరల్‌ సీఐ సైదులు, ఎస్‌ఐలు విజయ్‌, నారాయణ్‌, యాదగిరి గౌడ్‌, డివిజన్‌ స్థాయి ఎస్‌ఐలు పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షణలో పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *