Breaking News

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎన్‌పిడిసిఎల్‌ నిజామాబాద్‌ ఎస్‌.ఇ. సుదర్శనం టౌన్‌ సబ్‌ డివిజన్‌ స్టాఫ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా టౌన్‌లో గల అన్ని రకాల విద్యుత్‌ సమస్యలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా లూస్‌ లైన్స్‌, రోడ్‌ క్రాసింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెల ఎత్తును పెంచడం, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర కంచెలు ఏర్పాటుచేయటం, విరిగిన స్థంబాలను తొలగించడం, జంతువులకు, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన పవర్‌ వీక్‌ ప్రోగ్రాంలో ఈ సమస్యలన్నింటిని తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో డిఇఇ వెంకట్రమణ, ఏ.డి.ఇ. అశోక్‌, టౌన్‌ ఎ.ఇ.లు, సబ్‌ ఇంజనీర్లు, ఎఫ్‌ఎం, ఎల్‌ఐ, ఎల్‌ఎంలు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *