Breaking News

స్వచ్చంద సేవా సమితి ఆర్థిక సాయం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బత్తిని సంగీత అనే మహిళ గర్భిణిగా ఉండగా అంతు చిక్కని వ్యాధి సోకి వైద్య పరీక్షల కోసం చాలా ఖర్చు అయింది. సంగీత ఇటీవల ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో, విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకుడు వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి తనవంతు సహాయంగా రూ. 5 వేలు ఆర్థిక సహాయం చేశారు.

గురువారం కాంగ్రెస్‌ నాయకులు వారి ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నర్సింలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బాలరాజ్‌ గౌడ్‌, పరందాములు, జనార్దన్‌ రెడ్డి, హఫీజ్‌, బిట్ల సురేందర్‌, తిరుపతి, ప్రసాద్‌, రాజేష్‌, రాజేశ్వర్‌ గౌడ్‌, బాలకిషన్‌ తదితరులున్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *