Breaking News

Daily Archives: September 13, 2019

దమ్మ కుంటను పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం శాబ్దిపూర్‌ గ్రామ ఎడమ తాండాలో ఢిల్లీ నుంచి విచ్చేసిన జల శక్తి అభియాన్‌ స్పెషల్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాండే ఆధ్వరంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దమ్మ కుంటను పరిశీలించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖాధికారులు డిఇ భాను ప్రసాద్‌, ఎ.ఇ. రాంప్రసాద్‌ వారి వెంట ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వినోద లక్ష్మణ్‌, కామారెడ్డి మండల ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు మాలావత్‌ రవీందర్‌ నాయక్‌, కామారెడ్డి మాజీ జడ్పిటిసి నిమ్మ మోహన్‌ రెడ్డి, ...

Read More »

స్వచ్ఛ గ్రామంగా మారుస్తాం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ గ్రామాలుగా చేసేందు కోసం గ్రామ సర్పంచులు అన్ని విధాలుగా పనులను చేయడం జరుగుతుంది. ఇందులో బాగంగా నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్‌ శిథిలావస్థలో ఉన్న ఇళ్లను జెసిబితో కూల్చివేసే పనులు చేపట్టారు. శుక్రవారం ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తానని అన్నారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ...

Read More »

దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సర్పంచ్‌ పిట్ల అనసూయ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు చాకలి సుజాత రమేష్‌ కుమార్‌ కలిసి దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రజకుల కోసం దోబీ ఘాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ...

Read More »

మైనార్టీల అభివద్ధికి పెద్దపీట

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో సీడీపీ నిధుల ద్వారా 5 లక్షలతో నిర్మించిన మైనారిటీ స్మశానవాటిక ప్రహరీగోడను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి చిలకపాలెం శిలాఫలకానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ఆడపడుచుల పెళ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వంలో షాది ముబారక్‌, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1 లక్ష 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. 70 సంవత్సరాలలో ...

Read More »

బిసి కమ్యూనిటీ భవనం ప్రారంభం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో ఎస్‌డిఆఫ్‌ నిధుల ద్వారా 10 లక్షలతో నిర్మించిన బిసి కమ్యూనిటీ హాల్‌ను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాల అభివద్ధికి కషి చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో బీసీలకు కమిటీ భవనాలను నిర్మించడం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివద్ధిపై దష్టిసారిస్తోందని, గత ప్రభుత్వాలు గ్రామాల అభివద్ధి చూడలేదని అన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో ఉపాధి హామీ, సిడిపి నిధుల ద్వారా 5 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నుండి గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామాన్ని స్వచ్చంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని అన్నారు.

Read More »

సొంతింటి కల నిజం చేస్తాం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని తాడ్కోల్‌ గ్రామం వద్ద రూ. 26.50 కోట్లతో అదనంగా నిర్మిస్తున్న 500 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దొంగలు, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఇళ్ళు పంచుకుని దోచుకున్నారని, నా ప్రాణం పోయినా, ఎంత ఒత్తిడి వచ్చినా లొంగను, అలా జరగనివ్వనని పేర్కొన్నారు. అర్హులైన, నిజమైన ...

Read More »

విద్యార్థుల భవిష్యత్తుతోనే బంగారు తెలంగాణ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలో రూ. 2.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవాలయాలు ఎలా ఉంటాయో విద్యాలయాలు కూడా అలానే ఉండాలని, గుడి కట్టడానికి చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో బడి కట్టడానికి అంతే అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో 1.70 లక్షల మంది ...

Read More »

ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని గాదేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, అందుకు ప్రతిఒక్కరి సహకారం అవసరమని సర్పంచ్‌ గాదేపల్లి నక్కల భూమేష్‌ అన్నారు. నందిపేట్‌ మండలంలోని గాదేపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం చేశారు. మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆయన శ్రమదానం చేపట్టారు. ప్రధాన రోడ్లపై మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలోని పిచ్చి మొక్కలు ...

Read More »

గ్రామాల్లో పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలా పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన మోర్తాడ్‌ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ, గ్రామాలు పారిశుద్ధ్య పరంగా, హరితంగా కనిపించడానికి ముఖ్యమంత్రి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారని, దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా ...

Read More »

రక్త బలహీనతపై వ్యాసరచన పోటీలు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో, న్యూ లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో శుక్రవారము స్థానిక అంగన్‌వాడి ఉపాధ్యాయల బందం రక్త బలహీనతపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. వ్యాసరచనలో పాల్గొని, గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి 10వ తరగతికి చెందిన సంతోషిని, రెండవ బహుమతి దీపికా అందుకున్నారు. కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల కరస్పాండెంట్‌ శాంతి మాట్లాడుతూ రక్త బలహీనత ఎనిమియాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చాలా సతోషకరమని, ...

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ తెరాస మండల గ్రామ నూతన కమిటీ వివరాలను కామారెడ్డి జిల్లా, నియోజకవర్గ ఇంచార్జి వి.జి. గౌడ్‌కు అందజేశారు. కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో తెరాస నాయకులు గాంధారి మండల పార్టీ ప్రెసిడెంట్‌ సత్యం రావు గారు, మాజీ జడ్పిటిసిలు రాజేశ్వర్‌ రావు, మద్ది మహేందర్‌ రెడ్డి, తాడ్వాయి ప్రెసిడెంట్‌ సాయి రెడ్డి, గోపాల్‌ రావు, సదాశివనగర్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌, రామారెడ్డి ప్రెసిడెంట్‌ గోపాలరెడ్డి, ఎంపీపీ దశరథ్‌ రెడ్డి, సతీష్‌, ...

Read More »

రామమందిర నిర్మాణం కోసం పాదయాత్ర

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ రామ సేన కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయ్యోద్యలో రామమందిరము నిర్మించాలని కోరుతూ బెంగుళూరు నుండి అయోధ్య వరకు 2 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఆగస్టు 16 న ప్రారంభించిన మంజునాథ్‌, మంజయ్య చావడిలతో పాటు 10 మంది రామ భక్తులు శుక్రవారం కామారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి కామారెడ్డిలో ఘన స్వాగతం పలికారు. మంజునాథ్‌ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైనంత తొందరగా చేపట్టాలనే సంకల్పంతో ...

Read More »

20 సంవత్సరాల కల నెరవేరింది..

నందిపేట్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని 8వ వార్డు ఎన్‌టిఆర్‌ కాలనీలో రోడ్డు మరమ్మత్తు పనులు చేయడంతో కాలనీ మొత్తం అద్దంలా మెరిసిపోతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా నందిపేట్‌ గ్రామంలో మొరం రోడ్డు పనులు చేస్తూ గ్రామాన్ని నందనవనంగా తయారు చేస్తున్నారు. మంచి నాణ్యత గల ఎర్ర మొరంతో గుంతలు పూడుస్తూ రోడ్డు సౌకర్యం లేని కాలనీలకు మొరంతో రోడ్డు వేస్తున్నారు. దీంతో గ్రామం మొత్తం ఎర్రగా చూపరులను ఆకర్షిస్తుంది. ...

Read More »

నిమజ్జనం కోసం క్రేన్‌ల ఏర్పాటు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మునిసిపాలిటీ అధికారులు వినాయక నిమజ్జనం సందర్భంగా క్రేన్‌లు ఏర్పాటు చేశారు. పోచారం డ్యామ్‌ నుండి వదిలిన నీరు కాలువ ద్వారా పెద్ద చెరువుకు చేరుకోవడంతో చెరువు నీటితో నిండిపోయి అలుగు ప్రవహిస్తుంది. ముందు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా సిబ్బంది వినాయక నిమజ్జనం కోసం క్రేన్‌లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నీటిలోకి దిగవద్దని పేర్కొన్నారు. ఎంపీడీవో వెంకటేశ్వర్‌, మునిసిపాలిటీ కార్యదర్శి. జీవన్‌, టిఆర్‌ఎస్‌ నాయకుడు కొండం గారి రాములు ఉన్నారు.

Read More »

ఆలయాల్లో చోరీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌ గ్రామ శివారులో దుర్గమ్మ దేవాలయం, ఎల్లమ్మ గుడి, మల్లికార్జున స్వామి గుడిలో రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు పగలగొట్టి మూడు ఆలయాలకు సంబంధించిన హుండీలో మల్లన్న స్వామి మీసాలు రెండు తులాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని లింగాపురం గ్రామస్తులు తెలిపారు.

Read More »

నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం టేక్రియాల్‌ చెరువు వద్ద గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ పరిశీలించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఇంచార్జ్‌ చందర్‌ నాయక్‌, కామారెడ్డి తహసిల్దార్‌ రాజేంద్ర, జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమ, పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Read More »

ముళ్ళ పొదలు తొలగింపు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్‌ బీడీ కాలనీలో స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ వైస్‌ యంపీపీ కుడుముల సత్యం ఆధ్వర్యంలో రోడ్డుకు రెండు వైపులా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు. జేసిబి సహాయంతో పనులు చేపట్టారు. కాగా ఇందుకయ్యే ఖర్చు సత్యం భరించారు. ముళ్ళ పొదలు తొలగించడంతో రోడ్డు అందంగా కనిపిస్తుంది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం వెంట ఎంపిటిసి సంతోష్‌, రాము, సజ్జు కృష్ణ, చక్రపాణి ...

Read More »

హెల్త్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ రజినీ హెల్త్‌ కిట్‌లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం హెల్త్‌ కిట్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో గోపాలకష్ణ, మండల పరిషత్‌ అధికారి గౌస్‌, ఎంఈవో గణేష్‌ రావ్‌, వైద్యాధికారి క్రిస్టినా, హెచ్‌ఈవో వెంకటరమణ, వ్యాయమ ఉపాధ్యాయుడు క ష్ణమూర్తి ఉపాధ్యయులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

గంగమ్మ చెంతకు గణనాథుడు

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11రోజులు నిత్యపూజలు అందుకున్న లంబోదరుడిని తల్లి గంగమ్మ చెంతకు భక్తులు భకి శ్రద్దలతో తరలించారు. గురువారం చివరి రోజు కావడంతో ప్రత్యేకంగా గణనాదులను అలంకరించి గ్రామాల్లో ప్రధాన వీధులగుండా డప్పు వాయిద్యాలు, భజనలతో ఊరేగింపుగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి లంబోదరుడిని నిమర్జనానికి తరలించారు. రెంజల్‌ మండల కేంద్రంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి శోభయాత్రను ఎంపీపీ రజినీ, ఎస్సై శంకర్‌ ప్రారంభించారు. మండలంలోని రెంజల్‌, తాడ్‌ బిలోలి, దండిగుట్ట, ...

Read More »