Breaking News

దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సర్పంచ్‌ పిట్ల అనసూయ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు చాకలి సుజాత రమేష్‌ కుమార్‌ కలిసి దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు.

మాజీ జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రజకుల కోసం దోబీ ఘాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో అభివద్ధి జరుగుతుందని, కెసిఆర్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్వచ్ఛ గ్రామంగా ఏర్పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచులు సంగమేశ్వర్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌, నాయకులు గంగారెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గుప్త, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *