Breaking News

విద్యార్థుల భవిష్యత్తుతోనే బంగారు తెలంగాణ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలో రూ. 2.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవాలయాలు ఎలా ఉంటాయో విద్యాలయాలు కూడా అలానే ఉండాలని, గుడి కట్టడానికి చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో బడి కట్టడానికి అంతే అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో 1.70 లక్షల మంది ఉపాద్యాయులుగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ శాఖ తర్వాత విద్యాశాఖకే అత్యధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చెసే అధికారం ఎవరికీ లేదని, తమ స్వంత ఇంటిని ఏ విధంగా నాణ్యంగా కట్టుకుంటామో, విద్యాలయాలను కూడా అంతే నాణ్యతతో వందేళ్ళు ఉండే విదంగా నిర్మించాలని స్పీకర్‌ పేర్కొన్నారు.

ప్రవేటు, కార్పొరేట్‌ విద్యాలయాల విద్యార్థులే కాదు ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉద్యోగాలు సాదించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన వసతులు, సౌకర్యాలను కల్పిస్తుంది, కాని వారిని అద్భుతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాద్యాయులదేనని సూచించారు.

విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, గురువులను గౌరవించడం ఎంతో ముఖ్యమని స్పీకర్‌ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు బాగునప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *