Breaking News

మైనార్టీల అభివద్ధికి పెద్దపీట

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో సీడీపీ నిధుల ద్వారా 5 లక్షలతో నిర్మించిన మైనారిటీ స్మశానవాటిక ప్రహరీగోడను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి చిలకపాలెం శిలాఫలకానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ఆడపడుచుల పెళ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వంలో షాది ముబారక్‌, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1 లక్ష 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు.

70 సంవత్సరాలలో జరగని అభివద్ధి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. ఆడపడుచుల కోసం ఇంటింటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీటిని అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యుడు మొహమ్మద్‌, అబ్దుల్‌ ఘాని తదితరులున్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *