Breaking News

ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని గాదేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, అందుకు ప్రతిఒక్కరి సహకారం అవసరమని సర్పంచ్‌ గాదేపల్లి నక్కల భూమేష్‌ అన్నారు. నందిపేట్‌ మండలంలోని గాదేపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం చేశారు.

మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆయన శ్రమదానం చేపట్టారు. ప్రధాన రోడ్లపై మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలోని పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపట్టారు. వీధులలో మురికి కాల్వలను శుభ్రం చేసి డెంగ్యూ, మలేరియా అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలలో పరిశుభ్రత, సామాజిక కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు.

మహిళలు, డ్వాక్రా సంఘాలు కలసి వచ్చి స్వచ్ఛందగా శ్రమదానంలో పాల్గొంటున్నారని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా విదిస్తామని హెచ్చరించారు. చెత్తను చెత్త కుండీల్లోనే వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుగుణ చిన్నారెడ్డి, సెక్రెటరీ ప్రమోద్‌, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *