Breaking News

స్వచ్ఛ గ్రామంగా మారుస్తాం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ గ్రామాలుగా చేసేందు కోసం గ్రామ సర్పంచులు అన్ని విధాలుగా పనులను చేయడం జరుగుతుంది. ఇందులో బాగంగా నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్‌ శిథిలావస్థలో ఉన్న ఇళ్లను జెసిబితో కూల్చివేసే పనులు చేపట్టారు.

శుక్రవారం ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తానని అన్నారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. సర్పంచ్‌ వెంట కారోబార్‌ రాములు, నాయకులు బోయిని సాయిలు, తదితరులు ఉన్నారు.

Check Also

నర్సరీలు పరిశీలించిన కలెక్టర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *