Breaking News

Daily Archives: September 14, 2019

మానవ మనుగడకు చెట్లు అవసరం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామిల్‌ యజమాన్యాలు, కార్పెంటర్లు హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ కోరారు. శనివారం స్థానిక వెంకట సాయి సా మిల్లులో సామిల్‌ యజమాన్యాలు, కార్పెంటర్స్‌తో ఏర్పాటుచేసిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానవ మనుగడకు కావలసిన చెట్లు నానాటికి క్షీణిస్తున్న తరుణంలో చెట్ల ప్రాముఖ్యతను గుర్తెరిగి అందరూ తప్పనిసరిగా తమ చుట్టుపక్కల పరిసరాలలో మొక్కలు నాటవలసిన అవసరం ...

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా కమిటీ సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎకనామిక్‌ అడ్వైజరీ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా అక్షయకుమార్‌ పండా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ చేస్తున్న సేవలు ముఖ్యంగా రక్తదానం విషయంలో చేస్తున్న సేవలను అభినందించారు. ఇంతేగాక రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ...

Read More »

మంచి ఆలోచనలతో మంచి భవిష్యత్తు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ 2019, స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన కేంద్ర బందం సభ్యులు ఉగ్రవాయి, క్యాసంపల్లి గ్రామాలను సందర్శించారు. క్యాసంపల్లి గ్రామంలో నిర్వహించిన గౌరవ యాత్రలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతు గ్రామాలను దేవాలయాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుతామో అంతకన్న ఎక్కువగా మన పరిసరాలను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవడం ...

Read More »

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ప్రారంభం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సంధర్భంగా ఫణిహారం రంగాచారి విగ్రహానికి సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ 1942 లో రంగాచారి కామరెడ్డి హై స్కూల్‌లో విద్యనభ్యసించారని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత చదువు కోసం వెళ్లి అక్కడ మక్దూమ్‌ మోహిదుద్దీన్‌తో ...

Read More »

సుభాష్‌రెడ్డి ఆర్థిక సాయం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గం నాగిరెడ్డిపేట్‌ మండలం రామక్కపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జనంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో బాలయ్య అనే యువకుడు మతి చెందిన విషయం తెలిసిందే. కాగా దాసరి బాలయ్య కుటుంబాన్ని సుభాష్‌రెడ్డి స్వచ్చంద సేవా సమితి ప్రతినిదులు పరామర్శించారు. వారికి ఇద్దరు పిల్లలు బీద కుటుంబం..ఆ ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసి కుటుంబానికి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవా సమితి ద్వారా రూ. 5 ...

Read More »

ప్రజల చేతుల్లోనే గ్రామ భవిష్యత్తు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల చేతుల్లోనే గ్రామ భవిష్యత్‌ ముడిపడి ఉందని గ్రామాలను పరిశుభ్రత పచ్చదనంతో వెల్లివిరియాలనే సంకల్పంతో ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో జరుగుతున్న 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివద్ధికి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తద్వారా గ్రామాల రూపురేఖలు ...

Read More »

గ్రంథాలయ సంస్థ తనిఖీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని కలకత్తా రాజారామ్మోహన్‌రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ అసిమ్‌ కుమార్‌ సేన్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి, డిప్యూటి లైబ్రేరియన్‌ సురేశ్‌బాబు, కామారెడ్డి గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, గ్రంథపాలకులు తారకం, సందీప్‌ కుమార్‌, సిబ్బంది ప్రతాప్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

Read More »

నగర ప్రజలు ప్లాస్టిక్‌ వాడకం నిరోదించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్‌ నగరంలో పరిశుభ్రత శానిటేషన్‌పై పలు వీధుల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి కమిషనర్‌ స్థాయి వరకు ప్రతిరోజు పరిశుభ్రత శానిటేషన్‌పై ప్రత్యేక దష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంప్‌ యార్డ్‌లకు తరలించాలని, రోడ్డుపై నిలిచిన నీటిని డ్రైనేజీ కాలువలలో ...

Read More »

స్పీకర్‌ను కలిసిన యూనియన్‌ నాయకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అనుసంధాగా ఏర్పాటైన ది నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ జిల్లా నాయకులు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని బాన్సువాడ స్వగహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగుల ప్రమోషన్లు, సహకార వ్యవస్థలో రెండంచెల విధానాలపై వినతిపత్రం సమర్పించారు. రెండంచెల విధానం వల్ల ఇటు రైతులకు అలాగే ఉద్యోగులకు మేలు జరుగుతుందని వారు స్పీకర్‌కు వివరించారు. ఉద్యోగస్తుల వినతిపత్రాన్ని స్వీకరించిన ...

Read More »