Breaking News

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపిడిఓ గోపాలక ష్ణ అన్నారు. మండలంలోని బొర్గం, తాడ్‌ బిలోలి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను సందర్శించారు. ప్రణాళిక కార్యక్రమాలను రోజువారీగా నిర్వహించాలని, గ్రామాల పరిశుభ్రత పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించారదని పంచాయతీ కార్యదర్శులు అమ్రీన్‌, శివచరణ్‌, సర్పంచ్లు వాణి, సునీత లకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, మురుగుకాలువలను జేసీబీ సహాయంతో చేపట్టిన పనులను పరిశీలించారు.

గ్రామాలు ఆదర్శంగా ఉండాలంటే ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటడం ద్వారా గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తయారు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి గౌస్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత, ఉపసర్పంచ్‌ మస్కురి లక్ష్మీ, వార్డు సభ్యులు నర్సయ్య, క్రాంతికుమార్‌, నారాయణ రెడ్డి, సభ్యులు సాయరెడ్డి, కార్తిక్‌ మహీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *