Breaking News

అందరికి హెల్త్‌ రన్‌ తప్పనిసరి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవనశైలి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులచే హెల్త్‌ రన్‌ నిర్వహిస్తున్నామని మెడికల్‌ కాలేజ్‌కు చెందిన డాక్టర్‌ దినేష్‌ తెలిపారు. ఆదివారం ఉదయం మెడికల్‌ కాలేజ్‌ నుండి ప్రధాన వీధుల గుండా మెడికల్‌ విద్యార్థులచే హెల్త్‌ రన్‌ నిర్వహించారు.

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పూట 45 నిమిషాలు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలని దీంతో బిపి షుగర్‌ గుండెజబ్బులకు దూరంగా ఉండవచ్చునని డాక్టర్‌ దినేష్‌ తెలిపారు. మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి అనేక రోగాల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరు ప్రతిరోజు శరీరానికి పని కల్పించి హెల్త్‌ రన్‌ పాటించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా వందమంది మెడికల్‌ విద్యార్థిని విద్యార్థులచే ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి హెల్త్‌ రన్‌ చేపట్టామని ఆయన తెలిపారు. రన్‌లో మెడికల్‌ కాలేజ్‌ డాక్టర్లు పాల్గొన్నారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *