Breaking News

Daily Archives: September 16, 2019

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం టీజీవిపి ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గహంలో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే జాతీయ పండగలాగా 15 ఆగస్ట్‌, 26 జనవరిలాగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. 1948 సెప్టెంబర్‌ 17 న తెలంగాణ అప్పటి ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ...

Read More »

వారానికోసారైనా నిర్మాణాలు పరిశీలించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో నిర్మాణాలు జరుగుతున్న పనులను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారానికోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. సోమవారం రాత్రి తన చాంబర్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటాయించిన డివిజన్లకు అనుగుణంగా వారి వారి డివిజన్లలో వారానికోసారి తప్పనిసరిగా పర్యటించి జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించాలన్నారు. 75 గజాల లోపు నిర్మాణాలకు అనుమతి అవసరం లేకున్నా దరఖాస్తు చేయవలసి ఉంటుందని, ఆ విషయాన్ని ప్రజలకు ...

Read More »

గర్భిణీలు పోషక పదార్థాలు తీసుకోవాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామంలో నెహ్రు యువ కేంద్రం, జనని యూత్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో పోషక అభియాన్‌ కింద పోషకాహార ప్రాముఖ్యత గురించి గర్భిణిలకు వివరించారు. పోషక పదార్థాలు తీసుకోవాలన్నారు. శీతల పానీయాలైన థమ్స్‌ఆప్‌ లాంటివి గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సేవించ రాదని, మహిళలకు గర్భిణీ స్త్రీలకు వివరించారు. ధామ్సబ్‌లో కెపిన్‌ అనే రసాయనం కలవడం వల్ల గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు మంచిది కాదనీ తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌ వాడీ టీచర్‌ ...

Read More »

రోగులకు పండ్ల పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంఛార్జి వినయ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ నూతల శ్రీనివాస్‌, ఆర్మూర్‌ టౌన్‌ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్‌, ఆర్మూర్‌ ప్రధాన కార్యదర్శి పూజ నరేందర్‌, బి.జే.పి. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

టిఎస్‌ఐపాస్‌ నిబంధనలు దరఖాస్తు దారులకు ముందే తెలియాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారికి వాటి నిబంధనలు ముందే తెలిసేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో టిఎస్‌ఐ- పాస్‌ జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాలుష్య నివారణకు సంబంధించిన అభ్యంతరాలతో పాటు ఇతర శాఖల నిబంధనలను ఆయా శాఖల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తద్వారా దరఖాస్తుదారులు నిబంధనలకు ...

Read More »

ప్టాస్లిక్‌ మనిషి మనుగడకు ప్రమాదం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు ప్రతి మనిషి ప్లాస్టక్‌ వినియోగిస్తూ ప్రకతి కలుషితం చేస్తున్నారని కామారెడ్డి సంక్షేమ గురుకులాల సంస్థ జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ జీ.మహేందర్‌ అన్నారు. సష్టిలో ఉచితంగా లభించే ప్రకతిలోని గాలి, నీరును మనిషే కలుషితం చేస్తున్నారని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఓజోన్‌ పరిరక్షణ గురించి వివరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో సోమవారం ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు 15 ఎకరాల స్కూల్‌, కాలేజ్‌ ...

Read More »

ఓటర్‌ పరిశీలన కార్యక్రమం సరిగా జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితా కనుగుణంగా ఓటర్ల పరిశీలన అందరికీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించడానికి అన్ని విభాగాలలో సంబంధిత ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇందుకై డ్వాక్రా సంఘాల సభ్యులను, విద్యార్థులను, ఉపాధి హామీ పథకం సభ్యులను, అంగన్‌వాడి కార్యకర్తలను, ...

Read More »

సిఐపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ బోధన్‌ శాఖ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీని బోధన్‌ సీఐ అడ్డుకోవడం బాధాకరమని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నల్ల నవీన్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆర్మూర్‌ శాఖ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. అంతే కాకుండా విద్యార్థులపై కేసులు పెడతామని భయబ్రాంతులకు గురిచేయటం సరికాదని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. జాతీయ జెండాను అవమాన ...

Read More »

పౌష్టికాహారంపై అందరికి అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు పౌష్టికాహారంపై ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమంలో అందరిని భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుండి 30వ తేదీ వరకు చేపట్టే పౌష్టికాహార మాసం సందర్భంగా ప్రగతి భవన్‌లో పౌష్టికాహారంపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్‌ విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ లోపం రక్తహీనత తక్కువ బరువుతో పుట్టే ...

Read More »

నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో సోమవారం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామంలోని వంగి పోయిన విద్యుత్తు స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో నుండి చెరువు వరకు విపరీతంగా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు. తీసివేసిన స్థలంలో మొక్కలు నాటుతామని వేల్పుర్‌ ఉపతహశిల్దార్‌, గ్రామ ప్రత్యేక అధికారి బొడ్డు రాజశేఖర్‌ తెలిపారు. అలాగే ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని, గ్రామ ప్రజలు కూడా సహకరించాలని ఈ ...

Read More »

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం వేలుపుగొండ విద్యుత్‌ ప్రమాదంపై మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఏలుపు గొండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఏలుపుగొండా శివారులోని బోరులోని మోటారు తీయడానికి వెళ్ళిన ముగ్గురురైతులు కరెంట్‌ షాక్‌ తగిలి మతి చెందారని, యెల్పు గోండ గ్రామానికి చెందిన మురళి దర్‌ రావ్‌, ఇమ్మడి నారాయణ లస్మరావు ముగ్గురు కరెంట్‌ షాక్‌తో ...

Read More »

పల్లె అభివృద్ధికి ప్రణాళిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులనుద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మంజూరైన పథకాలతో పాటు అత్యంత ప్రాధాన్యత పథకాలతో సమానంగా ఈ కార్యాచరణ ప్రణాళికలో జిల్లా అధికారులతోపాటు గ్రామపంచాయతీ స్థాయిలో ఆయా విభాగాలకు సంబంధించిన సిబ్బంది ఇతర శాఖల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని, ఈ విషయంలో ఆయా శాఖల జిల్లా అధికారులు ...

Read More »

విద్యుత్‌షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారులో కరెంట్‌ షాక్‌ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్‌ తీస్తుండగా పైపులకు కరెంట్‌ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) అక్కడికక్కడే మతి చెందారు. సంఘటన ...

Read More »