Breaking News

సిఐపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ బోధన్‌ శాఖ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీని బోధన్‌ సీఐ అడ్డుకోవడం బాధాకరమని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నల్ల నవీన్‌ కుమార్‌ అన్నారు.

ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆర్మూర్‌ శాఖ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. అంతే కాకుండా విద్యార్థులపై కేసులు పెడతామని భయబ్రాంతులకు గురిచేయటం సరికాదని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.

జాతీయ జెండాను అవమాన పరిచిన సీఐపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి వినయ్‌, మోహన్‌, లక్ష్మణ్‌, అజయ్‌, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *