Breaking News

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం టీజీవిపి ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గహంలో విలేకరులతో మాట్లాడారు.

సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే జాతీయ పండగలాగా 15 ఆగస్ట్‌, 26 జనవరిలాగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. 1948 సెప్టెంబర్‌ 17 న తెలంగాణ అప్పటి ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుందని, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా స్వాతంత్ర సంబరాలు నిర్వహిస్తే స్వరాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ మాత్రం సంబరాలకు నోచుకోక పోవడం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్‌ 17 విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోతే టీజీవిపి ఆధ్వర్యంలో అన్ని విద్యా సంస్థలలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రకాష్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నితిన్‌ కుమార్‌, టీజీవిపి నాయకులు నరేష్‌, శ్రీనివాస్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *