Breaking News

పౌష్టికాహారంపై అందరికి అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు పౌష్టికాహారంపై ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమంలో అందరిని భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుండి 30వ తేదీ వరకు చేపట్టే పౌష్టికాహార మాసం సందర్భంగా ప్రగతి భవన్‌లో పౌష్టికాహారంపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్‌ విడుదల చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ లోపం రక్తహీనత తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వివిధ శాఖల ప్రభుత్వ విభాగాలు ఎంతగానో కషి చేస్తున్నప్పటికీ పరిపూర్ణ లక్ష్యం ఇంకా చేరుకోవాల్సి ఉంది. పోషకాహార జన చైతన్య సందర్భంగా నగర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, శిశువులు, కౌమార బాలికలు, చిన్నారులకు మంచి పోషకాహారం అందించేందుకు విస్తతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యవంతులుగా చేయాలన్నారు.

ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ హార్టికల్చర్‌ శాఖలు గ్రామపంచాయతీ పట్టణ గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములై పిల్లల పెరుగుదలకు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. ప్రతి వారం ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంగన్‌వాడిలో మహిళలను, బాలికలను, గర్భిణీ స్త్రీలను చైతన్య వంతులుగా చేయాలని, పోషక స్థాయి పెంచడం, రక్తహీనత తగ్గించడం, పోషణ అభియాన్‌ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ అన్నారు.

నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య తనిఖీలు, రక్తహీనత పిల్లల పెరుగుదల మొదలైన కార్యక్రమాలను అంగన్‌వాడి సెంటర్ల వద్ద నిర్వహించాలన్నారు. పోషణ పై మహిళలు చర్చించుకుని ముందుకు పోయే విధంగా కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు.

ఈ సందర్భంగా మహిళా శిశు వికలాంగుల వయోవద్ధుల శాఖ జిల్లా అధికారి స్రవంతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, డిఆర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *