Breaking News

నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో సోమవారం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామంలోని వంగి పోయిన విద్యుత్తు స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో నుండి చెరువు వరకు విపరీతంగా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు.

తీసివేసిన స్థలంలో మొక్కలు నాటుతామని వేల్పుర్‌ ఉపతహశిల్దార్‌, గ్రామ ప్రత్యేక అధికారి బొడ్డు రాజశేఖర్‌ తెలిపారు. అలాగే ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని, గ్రామ ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్బంగా అయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఏనుగు శ్వేతా రెడ్డి, ఎంపిటీసి నోముల గంగరెడ్డి, విఆర్‌ఓలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *