Breaking News

గర్భిణీలు పోషక పదార్థాలు తీసుకోవాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామంలో నెహ్రు యువ కేంద్రం, జనని యూత్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో పోషక అభియాన్‌ కింద పోషకాహార ప్రాముఖ్యత గురించి గర్భిణిలకు వివరించారు. పోషక పదార్థాలు తీసుకోవాలన్నారు.

శీతల పానీయాలైన థమ్స్‌ఆప్‌ లాంటివి గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సేవించ రాదని, మహిళలకు గర్భిణీ స్త్రీలకు వివరించారు. ధామ్సబ్‌లో కెపిన్‌ అనే రసాయనం కలవడం వల్ల గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు మంచిది కాదనీ తెలిపారు.

కార్యక్రమంలో అంగన్‌ వాడీ టీచర్‌ వచాల, సాయివ్య, లక్ష్మీ, రేణుక, శిల్ప, మౌనిక, సీత పాల్గొన్నారు. అలాగే ఎన్‌వైకెఎస్‌ వలంటీర్‌ వజ్రే యోగేశ్వర్‌, జనని యూత్‌ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *