Breaking News

వారానికోసారైనా నిర్మాణాలు పరిశీలించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో నిర్మాణాలు జరుగుతున్న పనులను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారానికోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. సోమవారం రాత్రి తన చాంబర్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటాయించిన డివిజన్లకు అనుగుణంగా వారి వారి డివిజన్లలో వారానికోసారి తప్పనిసరిగా పర్యటించి జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించాలన్నారు.

75 గజాల లోపు నిర్మాణాలకు అనుమతి అవసరం లేకున్నా దరఖాస్తు చేయవలసి ఉంటుందని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే వారిపై న్యాయపరంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జరుగుతున్న పనులను ఆపివేయాలని తొలగించాలని ఆదేశించారు.

పబ్లిక్‌ ప్రైవేటు స్థలాల్లో నిర్మాణాలను ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగకుండా చూడాలని ఆదేశించారు. టిపిబిఎస్‌, టిపిఎస్‌లు వారానికి ఒకసారి ఆపై అధికారులు పక్షానికి ఒకసారి వారి ఏరియాల్లో తప్పనిసరిగా పర్యటించాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్‌ జలంధర్‌ రెడ్డి, ఏసిపి శ్యామ్సుందర్‌, టిపివో కర్ణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *