Breaking News

టిఎస్‌ఐపాస్‌ నిబంధనలు దరఖాస్తు దారులకు ముందే తెలియాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారికి వాటి నిబంధనలు ముందే తెలిసేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో టిఎస్‌ఐ- పాస్‌ జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాలుష్య నివారణకు సంబంధించిన అభ్యంతరాలతో పాటు ఇతర శాఖల నిబంధనలను ఆయా శాఖల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

తద్వారా దరఖాస్తుదారులు నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అనుమతులు దష్టిలో పెట్టుకొని దరఖాస్తు చేసుకుంటారని, అభ్యంతరాలుంటే వాటిని సరి చేసుకుంటారని ఆయన తెలిపారు. దీనితో దరఖాస్తుదారులు అనుమతుల గురించి వేచి చూసే అవసరం ఉండదని, ప్రభుత్వ శాఖలకు అనవసరమైన కరస్పాండెన్స్‌ తగ్గుతుందని తెలిపారు. కాలుష్యానికి సంబంధించిన అభ్యంతరాలుంటే వాటిని ప్రథమస్థానం లోనే రిజెక్ట్‌ చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా 17 కార్యాలయాలకు సంబంధించి వచ్చిన 649 దరఖాస్తులలో 638 దరఖాస్తులకు పరిశీలన పూర్తయిందని, 551 అనుమతించడం జరిగిందని, 78 నిరాకరించడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో ఆరుగురు ఎస్సీ దరఖాస్తుదారులకు, 3 ఎస్‌టి యూనిట్లకు అనుమతులకై తీర్మానం ఆమోదించారు.

దరఖాస్తుదారులకు యూనిట్ల స్థాపనతో 35 శాతం పెట్టుబడి సబ్సిడీ లభిస్తుందని అనుమతులు లభించి పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులు వ్యాపారాన్ని అభివద్ధి చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి లభించేలా చూడాలని ఆయన తెలిపారు. సమావేశంలో పరి శ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, డిటిసి శివలింగయ్య, ఎల్‌డిఎం జయ సంతోష్‌, మైన్స్‌ ఏడి సత్యనారాయణ, డిటిడబ్ల్యూఓ సంధ్యారాణి, డిఎస్‌సిడిఓ వో శశికళ, ఆర్‌డివోలు వెంకటేశ్వర్లు, గోపి రామ్‌, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *