Breaking News

అమరులకు జోహార్లు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం పుర వీధుల గుండా బైక్‌ ర్యాలీ చేపట్టారు.

అనంతరం రమణ రెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17 న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆపరేషన్‌ పోలో వల్ల నిజాం పాలనలో మగ్గుతు, రజాకారుల చేతిలో బిక్కు, బిక్కు మంటూ బ్రతుకుతున్న తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని, ఆరోజు రజాకారులను ఎదురించి తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ స్వాతంత్య్ర సాధనలో అమరులైన వీరులకు జోహార్లు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని ప్రకటించిన కెసిఆర్‌ స్వరాష్ట్ర సాధన తరువాత ఓటు బ్యాంకు రాజాకీయాల కోసం ఎంఐఎంకు తలొగ్గి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపటం లేదన్నారు. రాష్టంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరుల త్యాగాలకు విలువనిస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు.

Check Also

సదస్సుకు పిలిచారు… అవమాన పరిచారు…

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండల‌ కేంద్రంలో రైతు అవగాహన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *