Breaking News

Daily Archives: September 18, 2019

గ్రామాల ముఖ చిత్రాల్లో మార్పు కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికల ద్వారా గ్రామాల ముఖచిత్రాల్లో మార్పు కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామాలలో కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్‌, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు పక్కాగా నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాలలో శుభ్రం చేయడం మోరీలు తీయడం పాఠశాలలు ఆస్పత్రులలో పారిశుద్ధ్య ...

Read More »

21న జాబ్‌ మేళా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబానా తెలిపారు. విజయ బయో ఫర్టిలైజర్స్‌ ప్రయివేటు సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి మూడునెలల శిక్షణలో నెలకు రూ.5 వేలతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. శిక్షణ తర్వాత నెలకు రూ. 7 వేల వేతనం, కమీషన్‌, ఇన్సెంటివ్‌ లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్‌ (బైపిసి ఉత్తీర్ణత), ఆపై ...

Read More »

ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డికి అందరి సహకారం అవసరం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డిని నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కామారెడ్డి మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో కిరాణ షాపు వర్తకులు, హోటళ్ల యజమానులు, పండ్ల వ్యాపారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దుకాణాల ముందు చెత్త వేయకుండా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకొని అందులో వేయాలన్నారు. అంటురోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని, ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించకుండా ...

Read More »

పారిశుద్య నిర్వహణ చురుకుగా సాగాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్‌, సాలిడ్‌ వేస్ట్‌, మేనేజ్‌మెంట్‌ శిథిలాల తొలగింపు కార్యక్రమాలు చురుకుగా సాగాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపాలిటీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లపై చెత్తను, ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించారు. మురికి కాలువల్లో పూడిక తీత పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని, వీధి దీపాల నిర్వహణ, నీటి ట్యాంకులను శుభ్రపరచాలని ...

Read More »

ప్లాస్టిక్‌ రహిత సమాజం నిర్మిద్దాం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని రామ్‌ మందిర్‌ హైస్కూల్లో బుధవారం నరేంద్రమోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ రహిత దేశంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌, ఆర్మూర్‌ బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Read More »

చలో హైదరాబాద్‌ విజయవంతం చేయండి

రెంజల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమానపనికి సమనవేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని, నిరసిస్తూ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల ముందు మధ్యాహ్నం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 19న తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ నాయకురాలు సుజాత పిలుపునిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ అనేక రకాల ...

Read More »

ప్రజల భాగస్వామ్యంతో చురుకుగా పనులు సాగుతున్నాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్పది రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, తదితర కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో చురుగ్గా పనులు జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. బుధవారం దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని గడ్డి, చెత్తను తీసివేశారు. మొక్కలు నాటారు. అనంతరం జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ, గ్రామం ముందు రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా పారిశుద్ధ్యం పనులు నిర్వహించడం పట్ల అభినందనలు ...

Read More »

గ్రామ పంచాయతీలో ఖాళీల ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రెండు గ్రామపంచాయతీలో సర్పంచులు మరికొన్ని గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల ఖాళీలను భర్తీ చేయుటకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందల్వాయి మండలం గంగారం తండా, తిర్మన్‌ పల్లి గ్రామ పంచాయతీలలో సర్పంచులు వార్డు సభ్యులతోపాటు మరో 16 ...

Read More »

అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు పరిశుభ్రం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అందరూ కలిసి సమన్వయంతో పని చేసినప్పుడు పరిశుభ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం ఆయన నవీపేట మండల కేంద్రంలోను, ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నవీపేట్‌లో అధికారులతో మాట్లాడుతూ నవీపేట ప్రధాన రహదారి నుండి బాసరకు వెళ్ళే దారిలో, గ్రామపంచాయతీ పాఠశాలలు, మార్కెట్‌ యార్డ్‌, ప్రభుత్వ కార్యాలయాలలో మరింత శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య ...

Read More »

అక్టోబర్‌ 20 న విద్యాహక్కు పరిరక్షణ సభ

గాంధారి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాహక్కు పరిరక్షణ సభను బహుజన వికాస సమితి ఆధ్వర్యంలో అక్టోబర్‌ 20 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిధార్థ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను బుధవారం గాంధారి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర సిధార్థ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీ ఎంబెర్సెమెంట్‌ చెల్లించాలని అన్నారు. 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత ...

Read More »

రోట వైరస్‌ టీకాల కార్యక్రమం ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో బుదవారం రోట వైరస్‌ టికాల కార్యక్రమాన్ని అసుపత్రి డాక్టర్‌ విజయ భాస్కర్‌ రావు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలను ఇస్తున్నట్లు డాక్టర్‌ తెలిపారు. కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌, వార్డు సభ్యులు ఎస్‌జి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల గ్రామాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన బుధవారం రెంజల్‌ మండల కేంద్రంలోనూ, దూపల్లి గ్రామంలోను పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ గ్రామాలకు వచ్చే దారిలో రోడ్లకు ఇరువైపులా అనుకూలంగా ఉన్నందున అవెన్యూ ప్లాంటేషన్‌ చేయాలని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటికి ట్రీ ...

Read More »

రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా

గాంధారి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామపంచాయతి పరిధిలో రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానా తప్పదని సర్పంచ్‌ సంజీవ్‌ అన్నారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలను గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేశారు. గ్రామంలోని వ్యాపారులు తమ తమ దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు అందులో చెత్త వేయాలన్నారు. వ్యాపారస్తులే కాకుండా గ్రామస్థులు సైతం ఇండ్లలో చెత్త బుట్టీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెత్తను రోడ్డుపై ...

Read More »

బిసి కార్పొరేషన్‌ చెక్కు పంపిణీ

గాంధారి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి కార్పొరేషన్‌ చెక్కును బుధవారం గాంధారి ఎంపిడిఓ రవీశ్వర్‌ గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ అందజేశారు. గతంలో బిసి కార్పొరేషన్‌ ద్వారా గాంధారి గ్రామపంచాయతికి చెందిన రాజు పటేల్‌ మాధవ్‌ రావుకు రుణం మంజూరైంది. అయితే రుణం చెక్కు వచ్చే సమయానికి మాధవ్‌ రావు చనిపోయాడని ఎంపీడీఓ తెలిపారు. దీంతో చెక్కును కార్పొరేషన్‌కు తిరిగి పంపించి అతని భార్యకు రుణం మంజూరు చేశామన్నారు. మాధవ్‌ రావు భార్య ప్రమీల పేరు గల చెక్కును ...

Read More »

హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి పోలిస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్‌ రెడ్డీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం స్టేషన్‌లో ఎస్‌ఐ రాజశేఖర్‌ రివాల్వర్‌ తీసుకొని పాయింట్‌ బ్లాక్‌లో షూట్‌ చేసుకోవటంతో ఆయనను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసు కమీషనర్‌ కార్తికేయ విచారణ చేపట్టారు. జిల్లా ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతునారు. ప్రకాష్‌ రెడ్డీ భార్య తీవ్ర మనస్తాపానికి గురికావడంతో ...

Read More »