రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా

గాంధారి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామపంచాయతి పరిధిలో రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానా తప్పదని సర్పంచ్‌ సంజీవ్‌ అన్నారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలను గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేశారు. గ్రామంలోని వ్యాపారులు తమ తమ దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు అందులో చెత్త వేయాలన్నారు.

వ్యాపారస్తులే కాకుండా గ్రామస్థులు సైతం ఇండ్లలో చెత్త బుట్టీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెత్తను రోడ్డుపై వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని అన్నారు. వ్యాపారస్తులు, గ్రామస్థులు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గాంధారికి సహకరించాలని సర్పంచ్‌ సంజీవ్‌ కోరారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *