Breaking News

ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డికి అందరి సహకారం అవసరం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డిని నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కామారెడ్డి మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో కిరాణ షాపు వర్తకులు, హోటళ్ల యజమానులు, పండ్ల వ్యాపారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దుకాణాల ముందు చెత్త వేయకుండా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకొని అందులో వేయాలన్నారు.

అంటురోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని, ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించకుండా వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్వచ్చ కామారెడ్డి సాధనలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, మునిసిపల్‌ సూపరింటెండెంటు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *