గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల గ్రామాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన బుధవారం రెంజల్‌ మండల కేంద్రంలోనూ, దూపల్లి గ్రామంలోను పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ గ్రామాలకు వచ్చే దారిలో రోడ్లకు ఇరువైపులా అనుకూలంగా ఉన్నందున అవెన్యూ ప్లాంటేషన్‌ చేయాలని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటికి ట్రీ గార్డులు ఏర్పాటుచేసి పశువులు తినకుండా చూడడంతో పాటు పెద్దగా అయ్యేంతవరకు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలకు సంతప్తికరంగా బడ్జెట్‌ వచ్చే అవకాశం ఉన్నందున మొక్కలకు నీళ్లు పోయడానికి చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించడానికి ట్రాక్టర్‌ను, ట్రైలర్‌ను, ట్యాంకర్‌ను తీసుకోవాలని తెలిపారు.

ప్రజలు ఎక్కడ కూడా చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని చెత్తను యార్డులకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీధి దీపాలు పగటిపూట వెలగకుండా థర్డ్‌ వైర్‌ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రెంజల్‌ గ్రామంలో రెండు సంవత్సరాల క్రితమే వైకుంఠ దామం మంజూరు అయినప్పటికీ నిర్మాణం చేపట్టకపోవడంపై గ్రామ కార్యదర్శిని ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు.

అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా దోమలు ప్రబలకుండా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు. అనంతరం ఆయన రెంజల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పర్యటించి అన్ని వార్డులలో తిరిగి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంబంధిత డాక్టర్‌ను సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో కలెక్టర్‌ వెంట రెంజల్‌ ఎంపీపీ అధ్యక్షురాలు రజని, ఎంపీడీవో గోపాలకష్ణ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *