గ్రామ పంచాయతీలో ఖాళీల ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రెండు గ్రామపంచాయతీలో సర్పంచులు మరికొన్ని గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల ఖాళీలను భర్తీ చేయుటకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందల్వాయి మండలం గంగారం తండా, తిర్మన్‌ పల్లి గ్రామ పంచాయతీలలో సర్పంచులు వార్డు సభ్యులతోపాటు మరో 16 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దానికి ముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా సవరణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ నెల 18 నుండి 21వ తేదీ వరకు ఎన్నికల జాబితాలో అభ్యంతరాలను స్వీకరిస్తామని, 25వ తేదీన వాటిని పరిష్కరిస్తామని, 30వ తేదీన చివరి జాబితా ప్రచురిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు గ్రామపంచాయతీలో ప్రజలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, రాజకీయపార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *