Breaking News

పారిశుద్య నిర్వహణ చురుకుగా సాగాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్‌, సాలిడ్‌ వేస్ట్‌, మేనేజ్‌మెంట్‌ శిథిలాల తొలగింపు కార్యక్రమాలు చురుకుగా సాగాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపాలిటీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లపై చెత్తను, ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించారు.

మురికి కాలువల్లో పూడిక తీత పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని, వీధి దీపాల నిర్వహణ, నీటి ట్యాంకులను శుభ్రపరచాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరుచేసి కంపోస్టు చేసే విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. డంప్‌ సైట్‌ నిర్వహణ చేయాలని పేర్కొన్నారు. చెత్త వాహనాలను ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే మరికొన్నింటిని సమకూర్చుకోవాలని సూచించారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టు కింద పైలట్‌ ప్రాజెక్టు గ్రామాలుగా చేపట్టిన బిచ్కుంద మండలం రాజుల్లా, ఎల్లారెడ్డి మండలం రుద్రారం, రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా పంచాయతీ కార్యాలయ సూపరింటెండెంట్‌ సిద్దిరాములు, మునిసిపల్‌ శాఖాధికారులు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *