Breaking News

గ్రామాల ముఖ చిత్రాల్లో మార్పు కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికల ద్వారా గ్రామాల ముఖచిత్రాల్లో మార్పు కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామాలలో కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్‌, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు పక్కాగా నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాలలో శుభ్రం చేయడం మోరీలు తీయడం పాఠశాలలు ఆస్పత్రులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం రెగ్యులర్‌గా చేయాలని, డంపింగ్‌ యార్డుల, వైకుంఠ ధామాల నిర్మాణం, నర్సరీలకు స్థలాల గుర్తింపు తదితర కార్యక్రమాలు వాటి అభివద్ధి స్పష్టంగా కనిపించాలన్నారు.

వాటితో పాటు ఐదు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. గ్రామాలకు రాగానే అక్కడ 30 రోజుల కార్యక్రమాలు జరిగినట్లు స్పష్టంగా కల్పించాలన్నారు. ఇందుకోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించామని వచ్చే వారంలో వారు గ్రామాల్లో పర్యటించి నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎస్‌తో పాటు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, తదితర అధికారులు, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, జిల్లా పరిషత్‌ సీఈవో గోవిందు, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *