Breaking News

Daily Archives: September 20, 2019

బాధిత మహిళలకు సేవలందించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాధిత మహిళలకు సరైన న్యాయం జరిగే విధంగా కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక భాగంలో ఏర్పాటుచేసిన సఖి కేంద్రాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు లైంగిక వేధింపు గహ హింస ఇతరత్రా వేధింపులకు గురైన బాధిత మహిళలకు ఆత్మవిశ్వాసం పెంపొందే విధంగా సేవలు అందించాలని, సఖి కేంద్రం నిర్వాహకులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ ...

Read More »

సమస్యల పరిష్కారానికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ముందుంటుంది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పిఆర్‌సి ఐఆర్‌ ప్రకటించాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు నుంచి బదిలీలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం టీఎన్‌జివో భవన్‌లో నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోక ...

Read More »

కుటుంబ నియంత్రణ చెక్‌ పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ నియంత్రణ చేయించుకునేవారిని ప్రోత్సహించడంలో భాగంగా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం చెక్కు అందజేశారు. కొండాపూర్‌ గ్రామానికి చెందిన మాధవి కుటుంబ నియంత్రణ చేయించుకున్న నేపథ్యంలో ఆమెకు ప్రోత్సాహక చెక్కును పంపిణీ చేశారు. కుటుంబ నియంత్రణ చేయించుకొని జనాభా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Read More »

సమన్వయ భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళిక కార్యక్రమ నిర్వహణలో జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలతో మండలాభివృద్ది అధికారులు, మండల స్థాయి అధికారులు, ఫ్రెండ్‌ ఫిలాసఫర్‌ గైడ్‌ లాగా వ్యవహరిస్తు అందరు కలిసి సమన్వయ భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, డివిజన్‌, స్పెషల్‌ అధికారులతో 30 రోజుల కార్యాచరణ కార్యక్రమాలను సమీక్షించారు. సీనియర్‌ అధికారులు, జూనియర్‌లకు సలహాలు అందిస్తు మెరుగైన పనితీరును ...

Read More »

ప్రతియేడు వందకోట్లతో పాల ఉత్పత్తిదారులకు ఇన్సెంటివ్‌ అందజేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాభాపేక్ష లేకుండా రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం వందకోట్లతో పాల ఉత్పత్తిదారులకు లీటరుకు 4 రూపాయల ఇన్సెంటివ్‌ అందజేస్తున్నట్టు రాష్ట్ర పాడి పరిశ్రమ సమాఖ్య, పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలిపారు. శుక్రవారం నర్సన్నపల్లి పాల ఉత్పత్తి దారుల సమాఖ్య కేంద్రంలో జిల్లాలోని పాల ఉత్పత్తిదారులు, పశుమిత్ర రైతులతో ఏర్పాటు చేసిన పాల సేకరణ పెంపుదలపై పాడి రైతుల ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య ...

Read More »

చక్కని ఆలోచనలతో మంచి సమాజానికి బాటలు వేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చక్కని ఆలోచనలతో మంచి సమాజానికి బాటలు వేసుకోవాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్వచ్చ పాఠశాల కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్‌ మొక్కలు నాటారు. అనంతరం చీపురు పట్టి వీదులను శుభ్రం చేసే కార్యక్రమంలో శ్రమదానం చేశారు. హెల్మెట్‌ తప్పనిసరి అని తెలిపే ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ...

Read More »

ఎన్‌టిఆర్‌ కాలనీని మాడల్‌ కాలనీగా చేయడమే లక్ష్యం…

నందిపేట్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని 8వ వార్డు ఎన్‌టిఆర్‌ కాలనీలో హరితహారం మొక్కలను కాలనీ వాసులతో కలిసి వార్డు సభ్యురాలు అరుట్ల మంజుల శుక్రవారం నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఇండ్ల వద్ద నాటిన మొక్కలను రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. మేకలు లాంటి పశువులు మొక్కలను తినకుండా కాపాడాలని, మేకలను గ్రామ బయట మేపు కోవాలని తెలిపారు. సర్పంచ్‌ ఎస్‌జి వాణి తిరుపతి, ఎంపిటిసి, జడ్‌పిటిసి సహకారంతో కాలనీని మాడల్‌ కాలనీగా ...

Read More »

30 రోజుల ప్రణాళిక పరిశీలన

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం కన్నాపూర్‌ తండ గ్రామంలో శుక్రవారం 30 రోజుల ప్రణాళిక భాగంగా అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీఒ ధర్మారెడ్డి, టిఏ జగదీశ్‌ రెడ్డి గ్రామాన్ని సందర్శించి మొక్కలకు కంచె వేస్తున్న కూలీల దగ్గర వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కెతావత్‌ చందర్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ కాట్రొత్‌ సర్మన్‌ నాయక్‌, కార్యదర్శి రాములు, కూలీలు పాల్గొన్నారు.

Read More »

మేకలు తిరిగితే ఫైన్‌… మరి పందులకు ?

నందిపేట్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామానికి ఏమైంది..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు పందుల బెడద అంటూ ప్రజలు మాట్లాడుకొంటున్నారు. అసలే వర్షాకాలం..ఆపై వ్యాధులు విజంభించే తరుణం..ఇలాంటి స్థితిలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో గ్రామం దుర్గంధంగా మారి కంపుకొడుతోంది. ఏ వీధిలో చూసినా ఏమున్నది గర్వకారణం.. చెత్తాచెదారం- పందులు తప్ప అన్నవిధంగా తయారైంది. ఇకనైనా పాలకులు, అధికారులు మేల్కొనకపోతే మున్ముందు చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు గురువారం నందిపేట్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించి ...

Read More »

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమములో భాగంగా జడ్పీఎచ్‌ఎస్‌ పాఠశాలలో కలెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. జూనియర్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రణాళిక, గ్రామాలలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ...

Read More »

సఫాయి కర్మచారుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సఫాయి కర్మచారిలకు ఉపాధి పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఆర్థిక ఎదుగుదలకు కషిచేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిటీ సభ్యులు జగదీష్‌ హిరమరి అన్నారు. సఫాయి కర్మచారి ఉపాధి పునరావాస చట్టం 2013 ప్రకారంగా జిల్లాలోని పారిశుధ్య కార్మికులకు వసతులను సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సఫాయి కర్మచరి సంక్షేమం కోసం 33 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, అట్టి నిధులతో ఈ వత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం ...

Read More »

గాంధారిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

గాంధారి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గిరిజన మండలమైన గాంధారిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు న్యాయం చేసినట్లవుతుందన్నారు. మండల కేంద్రానికి కామారెడ్డి, బాన్సువాడలు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయమై స్పందించాలని కోరారు.

Read More »

కూలిన ఇళ్ళను పరిశీలించిన సర్పంచ్‌

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మైలారం గ్రామంలో ఆరు ఇళ్ళు కూలిపోయాయి. కాగా శుక్రవారం ఉదయం సర్పంచ్‌ యశోద మహేందర్‌ కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. వీరి వెంట ఉపసర్పంచ్‌ అల్లం మైశయ్య, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, తదితరులున్నారు.

Read More »

విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించినట్టు ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణ తెలిపారు. అనంతరం విజేతలకు గ్రామ సర్పంచ్‌ విజయ్‌కుమార్‌ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read More »