Breaking News

Daily Archives: September 21, 2019

నేడు విద్యుత్‌ కోత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తుప్పుపట్టిన విద్యుత్‌ స్థంభాల తొలగింపు, అలాగే శిథిలమైన విద్యుత్‌ స్థంభాల తొలగింపు, మరమ్మతుల దృష్ట్యా ఆదివారం విద్యుత్‌ కోత విధించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్‌ కోత విధించనున్నామని, వినియోగదారులు సహకరించాలని అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని హమాల్‌వాడి, నామ్‌దేవ్‌వాడ, లలితమహల్‌ థియేటర్‌ రోడ్డు, గంజ్‌రోడ్డులో మరమ్మతు పనులు చేయడం జరుగుతుందన్నారు.

Read More »

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ, గాంధారి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని లయన్స్‌ క్లబ్‌ ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి మోతీ బిందు గలవారిని నిజామాబాద్‌ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్లు చేయబడుతుందన్నారు. ఆసక్తిగల వారికి విదేశీ ఫాకో సర్జరీ నామమాత్రపు చార్జీలతో కంటిలో అమర్చబడుతుందన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9885354226, 9182992 698 ...

Read More »

శ్రీరాంసాగర్‌ ప్రాజక్ట్‌లోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు 45.450 టిఎంసిలు చేరింది. ఇంకా 57,820 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1077.30 అడుగుల మేర నీరు నిలువ వుంది. శనివారం ఉదయం 6 గంటల వరకు 39 టీఎంసీలు చేరగా సాయంత్రం వరకు మరో 6 టీఎంసీలు చేరడం విశేషం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తోంది. వరద ఇలాగే ...

Read More »

వ్యక్తి ఆత్మహత్య

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌ గ్రామంలో గుర్రపు ముత్తేన్న (45) అనే వ్యక్తి పెద్దమ్మ గుడి వద్ద క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ విజయ్‌ నారాయణ తెలిపారు. ముత్తెన్న కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, నలుగురు కూతుళ్ళు ఉన్నారని ఆయన తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read More »

రక్త పరీక్షలను పరిశీలించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ జ్వరాలను దష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు రక్త పరీక్షలను పరిక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి ఆదేశించారు. శనివారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ నుండి సి.యస్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీ, సీజనల్‌ వ్యాదులు, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, యూరియా పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో నివారణ చర్యలను ...

Read More »

గురుకుల పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు

నందిపేట్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ బాలస్వస్త్‌ కార్యక్రమంలో భాగంగా నూత్‌పల్లి గురుకుల పాఠశాలలో ఆర్మూర్‌ మోబైల్‌ హెల్త్‌ టీమ్‌ మూడురోజుల పాటు పిల్లలందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. దంత సంరక్షణ, చర్మ వ్యాధులు, సీజనల్‌ వ్యాదులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులను గుర్తించి జిల్లా ఆసుపత్రికి పంపించారు. భారతదేశంలో రక్తహీనత అతిపెద్ద సమస్య అని, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని పిల్లలకు సూచించారు. ...

Read More »

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెంగ్యూ మలేరియా, విషజ్వరాలు, తదితర వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం పలు శాఖల కార్యదర్శులతో కలిసి హైదరాబాద్‌ నుండి జిల్లాల కలెక్టర్లతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు దోమలు ప్రబలకుండా ఆంటీ లార్వా చర్యలతో పాటు అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా ...

Read More »

స్వచ్చ గ్రామంగా చేసుకుందాం

నందిపేట్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాభివద్ధిలో గ్రామ ప్రజలంతా భాగస్వాములు కావాలని సిర్పూర్‌ గ్రామసర్పంచ్‌ లతా, గ్రామ కార్యదర్శి విఘ్నేశ్‌, ప్రత్యేకాధికారి సరోజ అన్నారు. నందిపేట మండలంలోని సిర్పూర్‌ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళ సంఘం సభ్యులతో కలిసి పచ్చదనం పరిశుభ్రతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ కార్యాలయంలో శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామం అభివద్ధి చెందాలంటే గ్రామ ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులు ...

Read More »

లంబాడాలు ఐకమత్యంతో ఉండాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో ఈనెల 9న జరిగిన పరిణామాన్ని దష్టిలో పెట్టుకొని ప్రొపేసర్‌ సీతారాం నాయక్‌ మాజీ ఎంపి నిజామాబాద్‌ జిల్లా ఏఐబిఎస్‌ఎస్‌ జిల్లా బాడితో శనివారం నిజామాబాద్‌లో సమావేశమయ్యారు. సోయం బాబూరావు మరో సారి ఇలాంటి సంఘటనలు చేయనీయకుండా ఐకమత్యంతో ఉండాలని లంబాడిలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐబిఎస్‌ఎస్‌ రాష్ట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తారచంద్‌ నాయక్‌, ఏఐబిఎస్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అద్యక్షులు గంగాదర్‌ నాయక్‌, ఉపాద్యక్షులు కిషన్‌ నాయక్‌, లక్ష్మన్‌ ...

Read More »

బాపూజీ త్యాగం వెలకట్టలేనిది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు జడల రజినీకాంత్‌, కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ వాసులకు ఆదర్శనీయుడు కొండ లక్ష్మణ్‌ బాపూజీ అని, గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం 1967 లో కేబినెట్‌ మంత్రిగా పనిచేస్తూ మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక ...

Read More »

సోదరభావాన్ని అలవరుచుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ఉద్బోదించారు. సమాజహితమే అభిమతంగా కషి చేసిన దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో శనివారం మాక్లూర్‌ మండలం మానిక్‌ బండార్‌ కిట్స్‌ కళాశాలలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న 20 మంది ప్రముఖులకు పురస్కారాలు ప్రధానం చేశారు. కార్యక్రమానికి విఠల్‌ రావు ...

Read More »

నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా వర్షాలు కురుస్తున్నందున నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. శనివారం ఆయన అకస్మాత్తుగా జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించే కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లి వివరాలు పరిశీలించగా అక్కడ ల్యాండ్‌ లైన్‌ టెలిఫోన్‌ పనిచేయడం లేకపోవడంతోపాటు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంపై కలెక్టర్‌ అసంతప్తి వ్యక్తం చేశారు. ...

Read More »

గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోనూ, ధర్మారంలోనూ, మోపాల్‌ మండల కేంద్రంలోనూ పర్యటించి జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ముఖ్యంగా ప్రధాన రహదారిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా సంతప్తికరంగా నిర్వహించలేదని తెలిపారు. హైదరాబాద్‌ ...

Read More »

నిబద్దత కలిగిన రాజకీయవేత్త కొండాలక్ష్మణ్‌ బాపూజీ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 7వ వర్ధంతిని శనివారం నందిపేట్‌ మండల కేంద్రంలో తెరాస నాయకులు నిర్వహించారు. బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాజీ ఎంపిటిసి బాలగంగాధర్‌ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన అదిలాబాద్‌ జిల్లా వాంకిడి గ్రామంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జన్మించారని, గాంధీజీతో కలిసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. అసిఫాబాద్‌ నుంచి 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా ...

Read More »

పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర (పట్టణ) పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో శనివారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర సంఘం అధ్యక్షులు యస్‌.ఆర్‌.సత్యపాల్‌ జ్యోతి వెలిగించి జోహార్లు తెలిపారు. వజ్ర సంకల్ప తెలంగాణ పోరాట యోధులు, పద్మశాలి అభ్యున్నతికి మార్గ దర్శకులు కొండ లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. అనంరతం నగరంలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్దనున్న బాపూజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బిల్ల మహేష్‌, దోర్నాల రాజు, ...

Read More »

మార్కెట్‌ యార్డు తరలింపు విరమించుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని డెయిలీ మార్కెట్‌ను నుండి రైతు బజార్‌కు మార్కెట్‌ తరలింపును విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మార్కెట్‌ యార్డులో కూరగాయల వ్యాపారస్తులు ఆందోళన నిర్వహించారు. కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ హడావిడిగా కామారెడ్డి గంజులో శనివారం అధికారులు ప్రారంభించిన రైతుబజార్‌లో రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇటు వ్యాపారులను, అటు రైతులను ఇబ్బందికి ...

Read More »

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికి రేషన్‌ కార్డులో పేరు కలిగిన వారికి ఈనెల 23వ తేదీ నుంచి చీరల పంపిణీ చేయనున్నట్టు తహసీల్దార్‌ అర్చన తెలిపారు. మహిళలు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు తీసుకువచ్చి బతుకమ్మ చీరలు పొందాలన్నారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ విఆర్వో, గ్రామ సంఘ అధ్యక్షురాలు, రేషన్‌ డీలర్‌ కమిటీగా పనిచేసి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పంపిణీ సరిగా ...

Read More »