Breaking News

రక్త పరీక్షలను పరిశీలించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ జ్వరాలను దష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు రక్త పరీక్షలను పరిక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి ఆదేశించారు. శనివారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ నుండి సి.యస్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీ, సీజనల్‌ వ్యాదులు, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, యూరియా పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో నివారణ చర్యలను విస్తతం చేయాలన్నారు. ప్రస్తుత సీజన్‌ మలేరియా, టైపాయిడ్‌ డెంగ్యూ జ్వరాలపై ప్రత్యేక దష్టి సారించాలని, స్వైన్‌ ప్లూ నివారణ చర్యలను చేపట్టాలన్నారు. వీటిని తనిఖి చేయలన్నారు. అవసరమైన మందులు, కిట్లు పంపుతున్నామన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా వైద్య సేవలపై సమీక్షించాలన్నారు.

అత్యవసర పరిస్థితి ఎదురైతే స్టేట్‌ కంట్రోల్‌ రూంతో సంప్రదించాలన్నారు. ఈ నెల 23 నుండి శాసనసభ నియోజకవర్గాల కేంద్రాలలో బతుకమ్మ చీరల పంపిణికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బతుకమ్మ పండుగా 28న ప్రారంభమవుతున్నందున మహిళలు బతుకుమ్మ చీరలను దరించాలని, ఇప్పటికే జిల్లాలకు 74 లక్షల చీరలను పంపామన్నారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కమిటీల ద్వారా పంపిణికి చర్యలు తీసుకోవాలన్నారు.

చౌకదరల దుకాణాల వారిగా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు చీరల పంపిణీపై గైడ్‌లైన్స్‌ పంపామన్నారు. కమిటీలకు తగుశిక్షణ ఇవ్వాలన్నారు. 18 సంత్సరాలు నిండిన తెల్లకార్డు మహిళకు ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ఎక్కువ పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. ఖరీప్‌ సీజన్‌కు సంబంధించి యూరియాను జిల్లాలకు పంపామని, వీటిని సక్రమంగా పంపిణీ అయ్యేలా చుడాలని కలెక్టర్లను కోరారు.

జిల్లాలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పిఏసిఎస్‌, ప్రయివేట్‌ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామాలలో పంపిణీ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు. వచ్చే రబీకి అవసరమైన ఏరువులు, యూరియా వివరాలు ఇవ్వాలన్నారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఉన్నందున మంచి పంటలు పండే అవకాశముందన్నారు. జిల్లాల కలెక్టర్లు ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకోవాలన్నారు.

ప్రొక్యుర్‌మెంట్‌ అక్టోబరు నుండి ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 340 ప్రొక్యుర్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పంట వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు. సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 6 వరకు తెలంగాణ వ్యాప్తంగా బతుకుమ్మ ఉత్సవాలను తెలంగాణ సంస్క తి ప్రతిబించించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలలో మహిళలు పాల్గొనాలన్నారు. జిల్లా స్థాయిలో ఘనంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ పి యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, పిడి చంద్రమోహన్‌ రెడ్డి, సిపివో శ్రీనివాస్‌, ఆర్డివోలు రాజేంద్ర కుమార్‌, రాజేశ్వర్‌, దేవేందర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ, జిల్లా అటవీ అధికారి వసంత, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *