Breaking News

Daily Archives: September 22, 2019

అభివృద్ధి పనులకు స్పీకర్‌ శంకుస్థాపన

బాన్సువాడ, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పలు అభివద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మిస్త్రీ గల్లీ, బీడీ వర్కర్స్‌ కాలనీ, ఇస్లాంపూర, కోన బాన్సువాడ, దాసరి గల్లీ, సంగమేశ్వర కాలనీలలో పలు అభివద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పట్టణంలో స్థానికంగా పర్యటించడానికి ప్రజలతో సులువుగా మాట్లాడడానికి ప్రత్యేకంగా తెప్పించిన విద్యుత్తు బగ్గీ వాహనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. అనంతరం ...

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోనూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయని, అలుగులు పారుతున్నాయని, కొన్నిచోట్ల పెద్ద మొత్తంలో నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు వీటిని చూడడానికి వెళ్ళినప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని వారు కూడా ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. రెవెన్యూ నీటిపారుదల తదితర ...

Read More »

అందరికి వ్యాయామం తప్పనిసరి

కామారెడి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక రాసి వనంలో పాదచారుల కోసం నూతనంగా నిర్మించిన నడక మార్గానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. పాదచారుల కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్స్‌ను ప్రారంభించారు. జిమ్‌ పార్కులో జిమ్‌ చేసే వారిని కలుసుకుని ఏర్పాట్ల గురించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం శ్రమదానంలో పాల్గొని గడ్డి తొలగించడం, మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ...

Read More »

మార్కెట్‌ యార్డులో చెత్త లేకుండా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని రైతు బజారును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్‌లో చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ పరిశీలించారు. ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ శాఖ అధికారి శైలజా, మునిసిపాలిటీ సిబ్బంది ఉన్నారు.

Read More »

ప్రజల భాగస్వామ్యంతో చురుకుగా పనులు సాగుతున్నాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్పది రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, తదితర కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో చురుగ్గా పనులు జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాజంపేట మండలం బసవన్నాపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. డంపింగ్‌ యార్డ్‌ పరిశీలించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ, కొత్త పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామాలలో డంపు సైట్‌, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటు తప్పనిసరని, అందుకోసం ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు ...

Read More »

జనవరి 2 నుంచి అశ్వమేధ గాయత్రీ మహాయజ్ఞం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 జనవరి 2వ తేదీ నుంచి 5 వరకు జరిగే కార్యక్రమం గురించి ఆదివారం కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అద్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గబ్బుల బాలయ్య, యదా నాగేశ్వర్‌ రావు, కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, శ్రీనివాస్‌ సర్‌, గౌరీ శంకర్‌, అతిమముల రమేష్‌, గోవింద్‌ భాస్కర్‌, ముప్పారపు ఆనంద్‌, వలపిశెట్టి లక్ష్మి రాజం, కస్తూరి నరహరి, వలపిశెట్టి భాస్కర్‌, ఆర్యవైశ్య గల్లీ సంఘాల ఆర్యవైశ్య ప్రముఖులు మరియు మహిళలు పాల్గొన్నారు.

Read More »

మార్కెట్‌ యార్డును తరలిస్తే ఉద్యమమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డెయిలీ మార్కెట్‌ యార్డులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు రోజులుగా డెయిలీ మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించాలని మున్సిపల్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని, మార్కెట్‌ను ఎందుకు తరలిస్తున్నారన్న విషయాన్ని అధికారులు చెప్పడం లేదని మండిపడ్డారు. కొత్త జిల్లా అయినందున ప్రజల అవసరాలకు తగినట్టుగా మార్కెట్‌ను విస్తరిస్తే తప్పులేదని, కానీ రైతుబజార్‌లో మార్కెట్‌ పర్మనెంటుగా ఉంటుందా ...

Read More »

బసవేశ్వర విగ్రహం ఆవిష్కరణ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రాంజోల్‌ గ్రామంలో ప్రధాన సర్కిల్‌ వద్ద మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ అందంగా కనిపించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వీరశైవ లింగాయత్‌ సమాజం అధ్యక్షలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Read More »

అసెంబ్లీ అండర్‌ టేకింగ్‌ కమిటీ చెర్మెన్‌గా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ అండర్‌ టేకింగ్‌ కమిటీ చెర్మెన్‌గా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఆదివారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్‌, అబ్రహం, శంకర్‌నాయక్‌, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్‌ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు. కమిటీ యొక్క ప్రధాన విధి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల కోసం శాసనసభ మంజూరు చేసిన మొత్తాలను కేటాయించినట్లు చూపించే ఖాతాల పరిశీలన. ఇది ...

Read More »

క్రీడా విద్యార్థులకు రాష్ట్ర అధికారి నజరానా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఎల్లారెడ్డి గురుకులంలో చదివి జాతీయ స్థాయి క్రేడా పోటీలలలో సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన ఇద్దరు విద్యార్థులకు 20 వేల నగదు బహుమానం లభించిందని కామారెడ్డి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి ప్రిన్సిపాల్‌ జి.మహేందర్‌ వివరించారు. 2018-19 విద్యాసంవత్సరం నవంబర్‌లో తమిళనాడు రాష్ట్రం ‘నమ్మక్కల్‌’ (సేలం) లో రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ‘షాట్‌ఫూట్‌లో 2వ స్థానంతో ‘సిల్వర్‌ మెడల్‌’ సాధించిన ఎల్లారెడ్డి గురుకుల ...

Read More »

అందరి సహకారంతో ముందుకు వెళుతున్నాము

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం తదితర కార్యచరణ ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరి సహకారంతో నిర్వహించుకుంటూ ముందుకు వెళుతున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రతతో పాటు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆయన ఎడపల్లి మండల కేంద్రం లోను, నెహ్రు నగర్‌ లోను, మంగళ్‌ పాడు గ్రామంలోనూ, చందూరు, మోస్ర మండల కేంద్రంలలోనూ ఆకస్మికంగా పర్యటించి నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ...

Read More »

యువకుడి ప్రాణం తీసిన టిక్‌టాక్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిక్‌టాక్‌ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పుల్‌ గ్రామ శివారులో గల కప్పలవాగు పొంగిపొర్లుతోంది. చెక్‌డ్యాం నుంచి వరద ఉధతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్‌ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్‌ వీడియోలు తీసుకున్నారు. తర్వాత ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో ...

Read More »

చిరుత పులి దాడిలో రెండు ఆవులు మతి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని రేపల్లెవాడలో పిట్ల పొచయ్యకు చెందిన రెండు ఆవులపై చిరుతపులి దాడి చేయగా మృతి చెందాయని ఇట్ల పోశయ్య తెలిపారు. అడవుల నుంచి చాలా సార్లు చిరుతపులి వచ్చి ఆవులపై దాడి చేసి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. సుమారు 60 వేల నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.

Read More »

ఎల్లారెడ్డిలో కంటి వైద్య శిబిరం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీఆర్‌టియు ఆద్వర్యంలో ఎల్లారెడ్డిలో శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో పిఆర్‌టియు భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధార పడిన వారు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో ఆరుగురికి సర్జరీ కొరకు రిఫర్‌ చేశారని పిఆర్టియు ఎల్లారెడ్డి శాఖ మండల అధ్యక్షులు యం. కష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి యం.రమేష్‌ కుమార్‌ తెలిపారు. శిబిరంలో పీఆర్‌టియు బాధ్యులు -కె నాగేందర్‌ రెడ్డి, యన్‌.వినయ్‌, ...

Read More »