Breaking News

ప్రజల భాగస్వామ్యంతో చురుకుగా పనులు సాగుతున్నాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్పది రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, తదితర కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో చురుగ్గా పనులు జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాజంపేట మండలం బసవన్నాపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. డంపింగ్‌ యార్డ్‌ పరిశీలించారు.

అనంతరం జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ, కొత్త పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామాలలో డంపు సైట్‌, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటు తప్పనిసరని, అందుకోసం ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు, వాటిలో పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఇంటికి దోమలు రాకుండా ఉండేందుకు పది కష్ణ తులసి మొక్కలు, ప్రతి ఇంటికి కరివేపాకు, వేప, నాలుగు రకాల పళ్ళ మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు పొలం గట్ల మీద వేప, చింత, టేకు మొక్కలు అందించడం జరుగుతుందని, గ్రామాలలో అంతర్గత రోడ్ల వెంబడి పెట్రోఫామ్‌, గుల్మరా తదితర చెట్లను పెంచడం జరుగుతుందని, వీటికి అవసరమైన మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీలోనే పెంచడం జరుగుతుందని తెలిపారు.

500 జనాభా దాటిన గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్‌ కలిపి ఇవ్వడం జరుగుతుందని, వీటి ద్వారా చెత్త తొలగించడం, మొక్కలకు నీరు పోయడం తదితర పనులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామానికి కావాల్సిన వసతులపై సంవత్సరం, ఐదు సంవత్సరాల యాక్షన్‌ ప్లాన్‌ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతిభ కనబరిచిన ప్రతి మండలంలో మూడు గ్రామాలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతి కింద లక్ష రూపాయలు బహుమతిగా వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అభివద్ధి అధికారి విజయకుమార్‌, గ్రామ సర్పంచ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *