అందరికి వ్యాయామం తప్పనిసరి

కామారెడి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక రాసి వనంలో పాదచారుల కోసం నూతనంగా నిర్మించిన నడక మార్గానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. పాదచారుల కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్స్‌ను ప్రారంభించారు. జిమ్‌ పార్కులో జిమ్‌ చేసే వారిని కలుసుకుని ఏర్పాట్ల గురించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు.

అనంతరం శ్రమదానంలో పాల్గొని గడ్డి తొలగించడం, మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాశివనంలో జాగింగ్‌, జిమ్‌, నడక కోసం వచ్చిన వారితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, శరీరానికి కావలసిన వ్యాయామం అందించాలని, తద్వారా శరీరానికి, మెదడుకు కావలసిన శక్తి, ఉత్సాహం లభిస్తుందని, చిన్నాపెద్దా వయసు తారతమ్యం లేకుండా ఆడా మగా అందరూ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కచ్చితంగా వ్యాయామం చేయాలని, యోగా లాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని, అంతే కాకుండా తమ చుట్టుపక్కల వారిని ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, రాశిఫలం ఇంచార్జ్‌ డాక్టర్‌ శంకర్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఇ శేషారావు, వాకర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఉమాపతిరావుకు నివాళులు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 27న మరణించిన రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *