Breaking News

మార్కెట్‌ యార్డులో చెత్త లేకుండా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని రైతు బజారును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్‌లో చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ పరిశీలించారు. ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ శాఖ అధికారి శైలజా, మునిసిపాలిటీ సిబ్బంది ఉన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *