Breaking News

క్రీడా విద్యార్థులకు రాష్ట్ర అధికారి నజరానా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఎల్లారెడ్డి గురుకులంలో చదివి జాతీయ స్థాయి క్రేడా పోటీలలలో సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన ఇద్దరు విద్యార్థులకు 20 వేల నగదు బహుమానం లభించిందని కామారెడ్డి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి ప్రిన్సిపాల్‌ జి.మహేందర్‌ వివరించారు.

2018-19 విద్యాసంవత్సరం నవంబర్‌లో తమిళనాడు రాష్ట్రం ‘నమ్మక్కల్‌’ (సేలం) లో రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ‘షాట్‌ఫూట్‌లో 2వ స్థానంతో ‘సిల్వర్‌ మెడల్‌’ సాధించిన ఎల్లారెడ్డి గురుకుల కాలేజ్‌ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి జి.మనోజ్‌, అలాగే ఇదే కళాశాలకు చెందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివిన యం.సాయికుమార్‌ ‘100 మీటర్ల పరుగు’ పందెంలో జాతీయ స్థాయిలో 2వ స్థానం ‘సిల్వర్‌ మెడల్‌’ సాధించారు.

ఈ సందర్భంగా ఇరువురికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చెక్కును ఆదివారం అందించామని జిల్లా గురుకుల సమన్వయ అధికారి జి.మహేందర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం వివిధ క్రీడా పోటీలలో జాతీయ స్థాయిలో పదహారు మంది విద్యార్థులు పాల్గొన్నారని, పతకాలు పొందిన వారికి రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డా,ఆర్‌.యెస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ఇలాంటి నగదు బహుమతులు ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రిన్సిపాల్‌ వివరించారు.

ఇదిలా ఉండగా గత సంతవ్సరం జూన్‌లో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ గురుకుల కాలేజి నుండి బదిలీపై వచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.నర్సింగరావు విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపడం వల్ల పేద విద్యార్థులకు నగదు బహుమతి రావడం విశేషమని కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు.

విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ సంచాలకులు బి.ఆర్‌.నర్సింగరావు, పి.ఈ.టి బి.లింగం లను ప్రిన్సిపాల్‌, కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌, స్కూల్‌ జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్‌ కుమార్‌, కాలేజ్‌ లెక్చరర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులను వ్యాయామ శిక్షకులని అభినందించారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *