Breaking News

Daily Archives: September 23, 2019

క్రీడా దుస్తుల పంపిణీ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజక వర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జి వినయ్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నందిపేట్‌లోని కేదారేశ్వర ఆలయంలో పూజ కార్యక్రమంలో వినయ్‌రెడ్డి పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం నందిపేట్‌ లోని మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.

Read More »

ఓటరు అవగాహనపై ఆపరేటర్‌లతో సమావేశం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల తహసిల్‌ కార్యాలయంలో సోమవారం ఓటరు అవగాహనపై మీ సేవ అపరేటర్‌లతో తహసీల్దార్‌ అలివేలు సమావేశం నిరవహించారు. వారిని ఉద్దేశించి తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నూతనంగా ప్రారంభించిన ఓటరు నమోదు యాప్‌ను ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌ లోడ్‌ చేయించేలా అవగాహన కల్పించాలాని కోరారు. ఒక ఎపిక్‌ నెంబర్‌కు ఒక ఫోన్‌ నెంబర్‌ మాత్రమే ఇవ్వాలన్నారు. ఇట్టి యాప్‌ ద్వార ఓటరు లిస్ట్‌ ...

Read More »

జంక్‌ ఫుడ్‌ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆద్వర్యంలో పోషణ మాసం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్‌ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విధ్యార్థులకు రక్తహీనత నివారణ, కౌమారదశలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, జంక్‌ ఫుడ్‌ వినియోగం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు గురించి ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పీడీ రాదమ్ము వివరించారు. అలాగే సేంద్రియ ఎరువుల వాడకం, కిచెన్‌ గార్డెనింగ్‌ గురించి రిలైన్స్‌ ఫౌండేషాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ...

Read More »

హరిత తెలంగాణ కై పాటుపడదాం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకై పాటుపడినప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా మారుతుందని నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మణిహారం హరితహారం గా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఆరు ...

Read More »

ప్రజల మధ్య ఉండడమే నా ధ్యేయం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉన్న పదవులు శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించి గ్రామ పంచాయతీ ఆవరణలోని చెత్తను శుభ్రపరిచారు. గ్రామంలో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారి గ్రామానికి రావడంతో ...

Read More »

ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తాహసీల్దార్‌ అలివేలు తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ అలివేలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వినోద, సీనియర్‌ అసిస్టెంట్‌ రఫీక్‌, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

స్వచ్చంద నందిపేట్‌కు సహకరించండి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని పరిసరాల పారిశుద్ధ్యంపై స్థానిక సర్పంచ్‌ సాంబారు వాణి తిరుపతి శ్రద్ద తీసుకొంటున్నారు. ఈనెల 19న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆకస్మిక తనిఖీ చేసి, అస్తవ్యస్త పారిశుద్ద పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు రోజులలో పరిశుభ్రంగా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్‌ పారిశుద్ధ్య పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. దగ్గరుండి పనులను చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం తెల్లవారు జామునుండే నందిపేట్‌ ప్రధాన వీధుల్లో నిండి ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆడపడుచులకు బతుకమ్మ సందర్బంగా సంతోషంగా పండుగ చేసుకోవాలని చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వాలు కూడా ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయలేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ

గాంధారి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సోమవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయంలో స్థానిక జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, సర్పంచ్‌ సంజీవ్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, తూర్పు రాజులు, బలరాజ్‌ తహశీల్దార్‌ లత, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సత్యం పటేల్‌ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. పోతాంగల్‌ కలాన్‌, వెంకటాపుర్‌, సర్వపూర్‌, గౌరారం, తదితర గ్రామాల్లో ఎంపీపీ అనిత బలరాం నాయక్‌, తెరాస నాయకులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ...

Read More »

డంపింగ్‌ యార్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 1.35 లక్షలతో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డ్‌ పనులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం మొక్కలను నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More »

గ్రామాన్ని అందంగా చేయడమే 30 రోజుల ప్రణాళిక లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో 30 రోజుల ప్రణాలికలో భాగంగా గత 15 రోజులనుండి పారిశుద్ద పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. బజార్‌ కొత్తూరు గ్రామాన్ని అందంగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సర్పంచ్‌ సందింటి పోసాని బాబురావు పేర్కోన్నారు. సోమవారం గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కన గల పెంట కుప్పలను, ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు గత పదిహేను రోజుల నుండి ప్రణాళికలో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ...

Read More »

అంగన్‌ వాడి కేంద్రం తనిఖీ

గాంధారి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని బీర్మల్‌ తండా అంగన్‌ వాడి కేంద్రాన్ని స్థానిక జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పిల్లలకు అందించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్‌ వాడి పరిసరాల్లో శుభ్రత పాటించాలని సూచించారు. హరితహారంలో మొక్కలను నాటలన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ దర్బార్‌ సింగ్‌, ఎంపీటీసీ పిర్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కార్యరూపం దాల్చిన కార్యాచరణ

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఎంపీపీ లోలపు రజినీ, ఎంపీడీవో గోపాలకష్ణ, ప్రజాపరిషత్‌ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రపరిచారు. తమ వంతు బాధ్యతగా కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా తమ కార్యాలయాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు నాటి ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో కళకళలాడే విదంగా కషి ...

Read More »

బతుకమ్మ పండగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ పండుగను దష్టిలో పెట్టుకొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం సాయంత్రం మినీ అంబేద్కర్‌ భవన్‌లో అర్బన్‌ నియోజవర్గ చీరల పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ గుప్త చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుపేద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ...

Read More »

పేదల ఆపద్భాంధవుడు కెసిఆర్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అసెంబ్లీ ప్యానెల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బిచ్కుంద మండలంలోని గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలుగా అభివద్ధి పథకాలు గడపగడపకు అందడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. 60 సంవత్సరాలలో కాని అభివద్ధి పనులు కేసీఆర్‌ పాలనలో జరుగుతున్నాయని చెప్పారు. నిరుపేద ఆడపడుచుల ...

Read More »

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎనిమిది ప్రైవేట్‌ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కతిక కార్యక్రమాలతో వైభవంగా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపిపి సంతోష్‌, వైస్‌ ఎంపిపి దేవేందర్‌, తహసీల్దార్‌ ఎలివేలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అజాగ్రత్త వహిస్తే ఉపేక్షించేది లేదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రత్యేక ప్రణాళికలో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల వారీగా ప్రగతి సాధించని పక్షంలో నిర్లక్ష్యం అజాగ్రత్త వహించిన అధికారులపై ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక వెనుకబడిన గ్రామాల కార్యదర్శులు, అధికారులు, సంబంధిత ఎంపీడీవోలు, మండల గ్రామ స్పెషల్‌ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాలలో, మండల కేంద్రాలలో నాణ్యతతో కూడిన ...

Read More »