Breaking News

బతుకమ్మ పండగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ పండుగను దష్టిలో పెట్టుకొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం సాయంత్రం మినీ అంబేద్కర్‌ భవన్‌లో అర్బన్‌ నియోజవర్గ చీరల పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ గుప్త చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుపేద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. బతుకమ్మ చీరల ఆడపడుచులకు ప్రయోజనంతో పాటుగా చేనేత కార్మికులకు జీవనాధారం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

ఒక్కొక్క బతుకమ్మ పండుగకు విభిన్న రంగులలో మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని, అయితే ఈసారి పది రంగులతో వంద రకాలుగా గతంలో కంటే మిన్నగా ఆకర్షణీయమైన రంగుల్లో పంపిణీ చేస్తామని, గత సంవత్సరం 4 లక్షల 83 వేల చీరలు పంపిణీ చేశామని, ఈ సంవత్సరం సుమారు 5 లక్షల 84 వేల చీరలను జిల్లాకు వచ్చాయని వాటిని మల్లారం బోధన్‌ వ్యవసాయ గిడ్డంగుల్లో భద్రపరచినట్టు చెప్పారు. దసరా పండుగకు ఆడపడుచులకు గిఫ్టుగా అందిస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రజలు అడగకుండానే అమలు చేశారని, అదేవిధంగా అభివద్ధి పనులు కూడా ముందుకు సాగుతున్నాయని, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడలేని విధంగా అమలు జరుగుతున్నాయన్నారు. ప్రతి నెల 54 కోట్ల రూపాయల విలువగల ఆసరా పింఛన్ల సంక్షేమ కార్యక్రమాలు పంపిణీ చేస్తున్నట్లు, సంక్షేమ అభివద్ధి రెండు సమాన ప్రాధాన్యతతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్క తిక ప్రతీకగా నిలుస్తుందని, ప్రకతిని ఆదరించే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు కురిసిన దష్ట్యా చెరువులు అలుగు, కాలువలలో నిండుగా ప్రవహిస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ పండుగని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు ఆదరణ ప్రాచుర్యం పొందిందని దానికి ముఖ్య కారకులు మాజీ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత అని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మహిళలు గౌరవంగా ఉండేందుకు బతుకమ్మ చీరలను విభిన్న రంగులలో వచ్చాయని చెప్పారు. మహిళలకు అన్నగా, మామగా కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికునిగా పనిచేస్తున్నారని చెప్పారు. వద్ధులకు ఒంటరి మహిళలకు, వితంతువుల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రతి నెల 2 వేల 16 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు మెరుగైన పౌష్టికాహారం అందించడం కోసం 12 వేలు డెలివరీ కాగానే కెసిఆర్‌ కిట్టు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. బతుకమ్మ చీరలు పంపిణీ నగరంలో 92 వేల మందికి 96 లోకేషన్‌లో రేషన్‌ షాపుల ద్వారా పంపిణి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 7, 8, 9 రేషన్‌ షాపుల పరిధిలోగల మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు, నగరంలో అన్ని ప్రదేశాలలో మంగళవారం నుంచి పంపిణీ జరుగుతుందన్నారు.

18 సంవత్సరాలు నిండి ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు గల వారందరికీ బతుకమ్మ చీరలు కులాలకు అతీతంగా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, తాజా మాజీ మేయర్‌ ఆకుల సుజాత, నగర పాలక కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, పిడి మెప్మా రాములు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *