అంగన్‌ వాడి కేంద్రం తనిఖీ

గాంధారి, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని బీర్మల్‌ తండా అంగన్‌ వాడి కేంద్రాన్ని స్థానిక జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పిల్లలకు అందించే భోజనాన్ని పరిశీలించారు.

పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్‌ వాడి పరిసరాల్లో శుభ్రత పాటించాలని సూచించారు. హరితహారంలో మొక్కలను నాటలన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ దర్బార్‌ సింగ్‌, ఎంపీటీసీ పిర్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *