స్వచ్చంద నందిపేట్‌కు సహకరించండి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని పరిసరాల పారిశుద్ధ్యంపై స్థానిక సర్పంచ్‌ సాంబారు వాణి తిరుపతి శ్రద్ద తీసుకొంటున్నారు. ఈనెల 19న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆకస్మిక తనిఖీ చేసి, అస్తవ్యస్త పారిశుద్ద పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు రోజులలో పరిశుభ్రంగా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ మేరకు స్థానిక సర్పంచ్‌ పారిశుద్ధ్య పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. దగ్గరుండి పనులను చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం తెల్లవారు జామునుండే నందిపేట్‌ ప్రధాన వీధుల్లో నిండి ఉన్న చెత్తా చెదారం శుభ్రపరిచే దిశగా పనులను చేపడుతున్నారు. సోమవారం ఉదయం నుండి వార్డ్‌ సభ్యులు ఎస్‌జి తిరుపతి దగ్గరుండి పనులు చేపట్టడం విశేషం.

ఈ సందర్బంగా సర్పంచ్‌ సంబరు వాణి తిరుపతి మాట్లాడుతూ గ్రామం అబివద్ది, శుభ్రంగా ఉండటం కోసం వ్యాధులు రాకుండా ఉండేందుకు, వేరే గ్రామాలనుడి వచ్చే వారికి, గ్రామస్తులకు ఇబ్బంది కాకుండా స్వచ్ఛ నందిపేట్‌ చేయుట కొరకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొవటం జరుగుతుందని చెప్పారు.

దీన్ని ప్రజలు భాధ అనుకోకుండా నిండు మనస్సుతో సహాయ సహకారాలు అందించాలని ప్రజలను కోరారు. ఇది భావితరాల కోసం నమూనాగా చేయాలనే తపన అన్నారు. వ్యాపారం చేసే వారికి ఇబ్బంది కాకుండ స్వచ్ఛత కొరకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతీ ఒక్కరు మానుకోవాలని కోరారు. గ్రామానికి నాయకుడిలా కాకా సేవకుడీలా ఉంటానని, ప్రజలందరు సహకరించాలని కోరారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *