Breaking News

అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ

గాంధారి, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సోమవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయంలో స్థానిక జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, సర్పంచ్‌ సంజీవ్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, తూర్పు రాజులు, బలరాజ్‌ తహశీల్దార్‌ లత, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సత్యం పటేల్‌ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు.

పోతాంగల్‌ కలాన్‌, వెంకటాపుర్‌, సర్వపూర్‌, గౌరారం, తదితర గ్రామాల్లో ఎంపీపీ అనిత బలరాం నాయక్‌, తెరాస నాయకులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గం, చిన్న గుజ్జుల్‌, బీర్మల్‌ తండా గ్రామపంచాయతిలలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌తో కలిసి సర్పంచులు దేవిసింగ్‌, రవి, దర్బార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధారి మండలానికి మొత్తం 12 వేల 901 చీరలు పంపిణీకి మొదటి విడతలో వచ్చాయని, వాటిని ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు తహశీల్దార్‌ లత తెలిపారు. ఇంకా 30 వ తేదీన అవసరమైన మేర చీరలు తెప్పిస్తామని తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయా గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో చీరలు అందుబాటులో ఉంచామని, లబ్ధిదారులు రేషన్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డ్‌ తీసుకెళ్లి చీరలు పొందాలని సూచించారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *